Share News

ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ABN , Publish Date - Mar 28 , 2026 | 01:23 PM

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్ వైఫల్యం కారణంగా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులున్నారు.

ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
IndiGo Flight Emergency Landing

ఇంటర్నెట్ డెస్క్: విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం(6E 579) సాంకేతిక లోపం తలెత్తడంతో శనివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో(IGI)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం గాలిలో ఉండగానే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శబ్దాలు వచ్చాయి. వెంటనే పైలట్లు అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించారు. స్పందించిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు.. ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.


ఆ తర్వాత.. ఆ విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 10:59 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలోని 161 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాథమిక తనిఖీల అనంతరం.. ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు తరలించారు. ప్రస్తుతం ఇంజిన్ వైఫల్యానికి గల కారణాలపై విమానయాన నియంత్రణ సంస్థ(DGCA), ఇండిగో సాంకేతిక బృందం విచారణ చేపట్టాయి.


ఇవి కూడా చదవండి...

రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ దిమ్మెల ధ్వంసం

సరిగ్గా 11:11 నిమిషాలకు అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టిన చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 28 , 2026 | 03:44 PM