Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 01 , 2026 | 07:23 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 01, 2026 22:03 IST

    ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమావేశం

    • యుద్ధ పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రధాని నెతన్యాహు

    • ఇరాన్‌ను చుట్టుముట్టాలని నెతన్యాహు ఆదేశం

  • Mar 01, 2026 21:35 IST

    హైదరాబాద్‌: ఫినో బ్యాంక్ CEO రిషి గుప్తాను అరెస్ట్ చేసిన DGGI

    • 14 రోజులపాటు రిమాండ్ విధించిన హైదరాబాద్ ఎకనమిక్ అఫెన్స్ కోర్ట్

    • ఆన్లైన్ గేమింగ్ సిండికేట్‌లో భాగంగా అరెస్ట్ చేసిన DGGI

    • రూ.840 కోట్ల ట్యాక్స్ ఎగొట్టిన ఫినో బ్యాంక్

  • Mar 01, 2026 21:35 IST

    నెల్లూరు: GGH పిల్లల వార్డులో అగ్నిప్రమాదం

    • షార్ట్‌ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు

    • దట్టమైన పొగతో రోగులు, పిల్లలు ఉక్కిరిబిక్కిరి

    • భయంతో పరుగులు తీసిన గర్భిణులు, బాలింతలు

  • Mar 01, 2026 20:50 IST

    టీ20 వరల్డ్‌కప్‌: భారత్‌ టార్గెట్‌ 196 పరుగులు

    • వెస్టిండీస్‌ స్కోర్‌: 195/4

    • భారత్‌ బౌలింగ్‌: బుమ్రా 2, హార్దిక్‌, వరన్‌ చెరో వికెట్‌

  • Mar 01, 2026 20:31 IST

    చిట్టీల పేరుతో మోసం

    • విజయవాడ: వన్‌టౌన్‌ చిట్టినగర్‌లో చిట్టీల పేరుతో మోసం

    • రూ.4 కోట్లతో పరారైన శ్రీనివాసరావు

    • కొత్తపేట పోలీసులను ఆశ్రయించిన బాధితులు

  • Mar 01, 2026 20:28 IST

    వికారాబాద్‌కు సీఎం రేవంత్

    • రేపు వికారాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

    • రాహుల్‌గాంధీతో కలిసి డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్‌

  • Mar 01, 2026 20:09 IST

    సీజేఐ ఇవాళ మొత్తం అమరావతిలో ఉన్నారు.. చాలా సంతోషం: సీఎం చంద్రబాబు

    • సీజేఐ.. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఇక్కడకు వచ్చారు: చంద్రబాబు

    • రాజధాని కోసం రైతులు ముందుకొచ్చి 33 వేల ఎకరాలు ఇచ్చారు: చంద్రబాబు

    • అమరావతిని గొప్ప నగరంగా నిర్మిస్తున్నాం: సీఎం చంద్రబాబు

  • Mar 01, 2026 20:08 IST

    న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వానిది కీలకపాత్ర: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

    • మధ్యవర్తిత్వం వల్ల అనేక కేసులు సులువుగా పరిష్కారం అవుతాయి: సీజేఐ

    • ప్రతి సమస్యకు కోర్టుకు రావడమే పరిష్కారం కాదు: సీజేఐ

    • కుటుంబ తగాదాల వల్ల కోర్టుల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి: సీజేఐ

    పూర్తి కథనం

  • Mar 01, 2026 19:52 IST

    గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలకు ఆందోళన అవసరం లేదు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

    • పరిస్థితులకు తగ్గట్టుగా తక్షణ చర్యలు చేపడుతున్నాం: మంత్రి కొండపల్లి

    • సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ సంయమనం పాటించాలి: మంత్రి కొండపల్లి

    • ఎప్పటికప్పుడు ఇండియన్ ఎంబసీలకు అందుబాటులో ఉండాలి: మంత్రి కొండపల్లి

    • అధికారులు అందుబాటులో ఉంటూ.. అధికారిక మీడియా సమాచారాన్ని ఫాలో కావాలి: మంత్రి కొండపల్లి

  • Mar 01, 2026 19:42 IST

    ఖమ్మం: భూదాన్ నిర్వాసితులతో కలిసి మంత్రి పొంగులేటి ప్రెస్‌మీట్

    • వెలుగుమట్ల అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిగింది: మంత్రి పొంగులేటి

    • వెలుగుమట్ల అంశంలో తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు: మంత్రి పొంగులేటి

    • గత ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చిందని బాధితులు చెబుతున్నారు: మంత్రి పొంగులేటి

    • దళారీలు వెలుగుమట్లలో అందినంత దోచుకున్నారు: మంత్రి పొంగులేటి అర్హులైన పేదవాడికి ఈనెల 15 లోపు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం: పొంగులేటి

  • Mar 01, 2026 18:41 IST

    ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత వికాస్‌

    • మహాసముంద్‌ జిల్లాలో లొంగిపోయిన 15మంది మావోయిస్టులు

    • డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ సమక్షంలో లొంగిపోయిన మావోలు

  • Mar 01, 2026 18:39 IST

    అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్‌

    • ఇరాన్‌, గల్ఫ్‌ ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్‌

    • దాడుల దృష్ట్యా భద్రతా మార్గదర్శకాలు పాటించాలి: సీఎం రేవంత్

    • భారత రాయబార కార్యాలయాలు జారీ చేసిన సూచనలు పాటించాలి: సీఎం రేవంత్

    • అత్యవసర పరిస్థితి ఎదురైతే తప్ప తెలుగువారు బయటకు రావద్దు: సీఎం రేవంత్‌

  • Mar 01, 2026 18:37 IST

    టాస్ గెలిచిన భారత్‌

    • టీ-20 వరల్డ్‌కప్‌: టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

    • ప్రారంభమైన భారత్‌, వెస్టిండీస్‌ మధ్య కీలక పోరు

    పూర్తి కథనం

  • Mar 01, 2026 18:24 IST

    టీ20 వరల్డ్‌కప్‌లో కాసేపట్లో డూ ఆర్‌ డై మ్యాచ్‌

    • అమీతుమీ తేల్చుకోబోతున్న భారత్‌, వెస్టిండీస్‌

    • గెలిచిన జట్టు టీ-20 వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌

  • Mar 01, 2026 18:23 IST

    కాసేపట్లో CCS భేటీ

    • కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ కీలక సమావేశం

    • ప్రధాని మోదీ అధ్యక్షతన సేవా తీర్థ్‌లో జరగనున్న CCS భేటీ

  • Mar 01, 2026 18:22 IST

    ఖమేనీ మృతిపై చైనా, నార్త్ కొరియా తొలి రియాక్షన్

    • ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రతపై జరిగిన దాడిగా పేర్కొన్న చైనా

    • అంతర్జాతీయ సంబంధాలపై యూఎన్ ఛార్టర్‌కు విరుద్ధం

    • సైనిక చర్యను తక్షణం నిలిపివేయాలని విజ్ఞప్తి

    • జాతీయ సార్వభౌమాధికార ఉల్లంఘనగా దాడులను పేర్కొన్న నార్త్ కొరియా

  • Mar 01, 2026 18:00 IST

    పాకిస్థాన్‌‌లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తతలు

    • ఇరాన్ అధినేత ఖమేనీ మృతికి నిరసనగా దాడులు

    • పాకిస్థాన్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌‌పై నిరసనకారులు దాడి

    • ఘర్షణల్లో 12మంది మృతి.. 30మందికి గాయాలు

    పూర్తి కథనం

  • Mar 01, 2026 17:27 IST

    సైప్రస్‌లోని యూకే స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ మిసైళ్ల దాడి

    • ఇరాన్‌ మిస్సైల్‌ ప్రయోగాన్ని ధృవీకరించిన యూకే

    • ఇరాన్‌ 2 మిస్సైల్స్‌ను సైప్రస్‌ మీద ప్రయోగించింది: యూకే

    • బహ్రెయిన్‌లోని మా స్థావరాలపై ఇరాన్‌ దాడి చేసింది: యూకే

  • Mar 01, 2026 17:23 IST

    భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి

    • ప్రతీకార దాడులు చేస్తున్న ఇరాన్

    • హార్ముజ్ జలసంధి మీదుగా వెళుతున్న ఆయిల్ టాంకర్‌‌పై దాడి

    • నౌకలో 15మంది భారతీయ సిబ్బంది

    పూర్తి కథనం

  • Mar 01, 2026 17:23 IST

    అమెరికా-ఇరాన్ యుద్ధంపై గ్రోక్ జోస్యం..! మస్క్ రియాక్షన్ ఇదీ

    • ఫిబ్రవరి 28న దాడులు మొదలయ్యే ఛాన్స్ ఉందన్న గ్రోక్

    • యాదృచ్ఛికంగా అదే రోజున దాడులు షురూ

    • ఇది వైరల్ కావడంతో స్పందించిన ఎలాన్ మస్క్

    • అసలైన మేధోశక్తి అంటే ఇదేనని కామెంట్

    పూర్తి కథనం

  • Mar 01, 2026 17:22 IST

    టీ-20 ప్రపంచ కప్ అప్డేట్స్..

    • సికందర్ రజా హాఫ్ సెంచరీ.. సౌతాఫ్రికా టార్గెట్ 154

    • అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తలపడుతున్న జింబాబ్వే-సౌతాఫ్రికా

    • 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసిన జింబాబ్వే

    • హాఫ్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్ సికందర్ రజా(73)

    • సౌతాఫ్రికా విజయ లక్ష్యం 154 పరుగులు

  • Mar 01, 2026 17:09 IST

    మాజీ మంత్రి కాకాణి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: ఎమ్మెల్యే సోమిరెడ్డి

    • ఎవరో ఏదో చెబితే నమ్మేడమేనా?: సోమిరెడ్డి

    • పేదలకు ఇచ్చే ఇళ్లలోనూ దండుకునే బతుకులు మీవి: సోమిరెడ్డి

    • కాకాణి రూ.వందల కోట్లు దండుకున్నారు: సోమిరెడ్డి

    • కాకాణి పనులను మేం చేయలేం: సోమిరెడ్డి

    • కాకాణి నోరు విప్పితే.. వినలేని భాష వస్తోంది: సోమిరెడ్డి

    పూర్తి కథనం

  • Mar 01, 2026 16:46 IST

    మూడో వన్డేలోనూ భారత్ ఓటమి.. ఆసీస్ క్లీన్ స్వీప్

    • భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్ మహిళా జట్టు

    • ఆఖరి మ్యాచ్‌లో 185 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా

    • తొలుత 409 పరుగులు చేసిన ఆసీస్

    • ఛేదనలో 224 పరుగులకే భారత్ పరిమితం

    పూర్తి కథనం

  • Mar 01, 2026 16:43 IST

    ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు, టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు

    • నగర నడిబొడ్డును లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్‌

    • ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు

    • ఉగ్రవాద పాలన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్‌

  • Mar 01, 2026 16:38 IST

    రాజధాని అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన

    • అమరావతి సమీపంలోని పిచ్చుకలపాలెం వద్ద జ్యుడీషియల్ అకాడమీ ఏర్పాటు

    • నేడు అకాడమీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్య కాంత్

    • రూ.165 కోట్లతో అకాడమీ నిర్మాణం

    • పాల్గొన్న సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, సీఎం చంద్రబాబు, సీఎస్ సాయి ప్రసాద్

    పూర్తి కథనం

  • Mar 01, 2026 16:32 IST

    CBSE పరీక్షలు వాయిదా..

    • పశ్చిమ ఆసియాలో తీవ్ర ఉద్రిక్తతలు

    • మార్చి 2న జరగాల్సిన CBSE పరీక్షలు వాయిదా

    • విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ CBSE కీలక నిర్ణయం

    • కొత్త తేదీలను తరువాత ప్రకటిస్తామని బోర్డు ప్రకటన

    పూర్తి కథనం

  • Mar 01, 2026 16:31 IST

    ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అరాఫీ

    • ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరేజా అరాఫీ

    • ఇరాన్ అధికారిక మీడియా వెల్లడి

    • ఖమేనీ వారసుడిగా ఎన్నిక జరిగేంత వరకూ సుప్రీం లీడర్ బాధ్యతలు

    పూర్తి కథనం

  • Mar 01, 2026 16:20 IST

    ఖమేనీ మృతితో ముగ్గురు సభ్యుల కౌన్సిల్ చేతికి ఇరాన్ పాలన

    • దేశ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్, న్యాయవ్యవస్థ అధిపతి,..

    • గార్డియన్ కౌన్సిల్‌లోని జ్యూరీ సభ్యుడితో కౌన్సిల్

    • సుప్రీం లీడర్ ఎన్నికయ్యేంత వరకూ పాలన బాధ్యత కౌన్సిల్‌కు అప్పగింత

    • ఖమేనీ మృతికి 40 రోజుల సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం

    పూర్తి కథనం

  • Mar 01, 2026 16:08 IST

    ఖమేని మృతికి నిరసనగా హైదరాబాద్‌లో షియా వర్గం ర్యాలీ

    • పురాణి హావేలీలో షియా వర్గం నిరసన ర్యాలీ

    • భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య కొనసాగిన నిరసన ర్యాలీ

  • Mar 01, 2026 15:54 IST

    తెలంగాణ రాజకీయాల్లో టైగర్ జోన్.. నల్గొండ జిల్లా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

    • రాష్ట్ర రాజకీయాలను శాసించే జిల్లానే కాదు.. పోరాటాల ఖిల్లా: కోమటిరెడ్డి

    • దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రారంభించాం: కోమటిరెడ్డి

    • ఈ స్కూళ్లు పూర్తయితే ప్రతి రాష్ట్రం తెలంగాణ వైపు చూస్తుంది: కోమటిరెడ్డి

    పూర్తి కథనం

  • Mar 01, 2026 15:52 IST

    అంగన్‌వాడీల సంక్షేమానికి కూటమ కట్టుబడి ఉంది: హోంమంత్రి అనిత

    • మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్‌గా పదోన్నతి: అనిత

    • ఎన్నికల్లో అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కృషి చేస్తున్నాం: అనిత

    • అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం: అనిత

  • Mar 01, 2026 15:51 IST

    టీ20 ప్రపంచ కప్ 2026: పాక్ మాజీ ప్లేయర్ సంచలన నిర్ణయం

    • రిటైర్‌మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకున్న పాక్ మాజీ ప్లేయర్ ఉస్మాన్ ఖాదిర్

    • 2024 అక్టోబర్‌లో క్రికెట్ రిటైర్‌మెంట్ ప్రకటించిన ఉస్మాన్ ఖాదిర్

    • పాక్ దిగ్గజ స్పిన్నర్ అబ్దుల్‌ ఖాదిర్‌ కుమారుడే ఉస్మాన్ ఖాదిర్

  • Mar 01, 2026 15:35 IST

    ఒమన్‌లో ఆయిల్‌ ట్యాంకర్లపై ఇరాన్‌ దాడులు

    • హర్‌మూజ్‌ జలసంధిలో ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌పై ఇరాన్‌ దాడి

    • దాడి సమయంలో ఆయిల్‌ ట్యాంకర్‌లో ఉన్న నలుగురికి తీవ్రగాయాలు

  • Mar 01, 2026 15:34 IST

    100 విమాన సర్వీసులు రద్దు..

    • ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి 100 విమాన సర్వీసులు రద్దు

    • ఇరాన్‌, మధ్యప్రాచ్యంలో దాడులతో విమాన సర్వీసులు రద్దు

  • Mar 01, 2026 15:33 IST

    ఇరాన్‌కి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వార్నింగ్‌

    • ఇరాన్‌లో ఉన్న అన్ని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తాం: నెతన్యాహు

    • నిరంకుశ పాలన నుంచి ఇరాన్‌ ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తాం: నెతన్యాహు

  • Mar 01, 2026 13:44 IST

    వైసీపీ హయాంలో ఎన్నో స్కాములు జరిగాయి: టీటీడీ చైర్మన్

    • టీటీడీ పవిత్రత దెబ్బతింటుందనే ఉద్దేశంతో వాటిని బయటపెట్టడంలేదు

    • సీఎం చంద్రబాబు సూచనతోనే ఇంతకాలం ఆగా

    • ఇకపై భూమన, వైవీ సుబ్బారెడ్డికి చుక్కలు చూపిస్తా

    • బాధ్యులను వదిలే ప్రసక్తే లేదు

    • దుష్ప్రచారం చేస్తున్నవారిపై లీగల్‌గా పోరాడతా

  • Mar 01, 2026 13:43 IST

    మార్ఫింగ్ వీడియోలతో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: టీటీడీ చైర్మన్

    • వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ఠపాలు చేయాలని చూస్తున్నారు

    • టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారు

    • టీటీడీ చైర్మన్‌గా ప్రమాణం చేసిన తొలి రోజు నుంచే రాజీనామా చేయాలంటున్నారు

    • వారి అవినీతి బండారం బయటకు వస్తుందనే ఇలాంటి ప్రచారం

  • Mar 01, 2026 13:42 IST

    కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్

    • హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు అయినా కట్టారా?

    • కట్టినట్టు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా

    • ఇళ్లు కూలగొట్టడం కాదు.. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలి

    • మూసీ సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు

  • Mar 01, 2026 12:58 IST

    శిథిలాల కింద ఖమేనీ మృతదేహం?

    • ఫస్ట్ ఫోటో అంటూ సోషల్ మీడియాలో వైరల్

  • Mar 01, 2026 12:53 IST

    పాకిస్తాన్: కరాచీలోని US కాన్సులేట్‌పై దాడి

    • కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డ ఆందోళనకారులు

    • నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు

    • ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం

  • Mar 01, 2026 12:39 IST

    తమిళనాడు పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ

    • పుదుచ్చేరిలో రూ.2,700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  • Mar 01, 2026 12:29 IST

    సోషల్ మీడియాలో వార్తలను చూస్తే అసహ్యం వేస్తుంది: వెంకయ్యనాయుడు

    • సోషల్ మీడియా యూట్యూబ్‌లో పెట్టే హెడ్డింగ్‌లు దారుణం: వెంకయ్యనాయుడు

    • ఇది సమాజహితం కాదు: వెంకయ్యనాయుడు

    • ఈ పరిస్థితిలో మార్పు రావాలి: వెంకయ్యనాయుడు

  • Mar 01, 2026 12:25 IST

    హైదరాబాద్: ముసారంబాగ్‌లో మూసీ నిర్వాసితుల ధర్నా

    • మూసీ అభివృద్ధి ఆపోద్దని సీఎం రేవంత్‌కు నిర్వాసితుల వినతి

    • మూసీ బాధితుల ఆందోళనకు సిటీ కాంగ్రెస్ నేతలు మద్దతు

    • మూసీ సుందరీకరణను కుట్రపూరితంగా BRS అడ్డుకుంటోందని ఆరోపణ

  • Mar 01, 2026 12:23 IST

    దుబాయ్‌లో బిక్కుబిక్కుమంటున్న భారత విద్యార్థులు

    • ఇరాన్ దాడులతో విద్యార్థుల్లో భయాందోళన

    • దుబాయ్ గగనతలంపై వరుసగా మిస్సైల్స్, డ్రోన్ల దాడులు

    • ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్ ఛేదించుకుని మరీ విధ్వంసం

  • Mar 01, 2026 12:19 IST

    ఖమేనీ హతం.. భారత్‌లో షియా ముస్లింల నిరసనలు..

  • Mar 01, 2026 12:17 IST

    లడఖ్: ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం హతం

    • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న షియా ముస్లింలు

    • లడఖ్‌లో వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్న షియా ముస్లింలు

  • Mar 01, 2026 12:11 IST

    ఇజ్రాయెల్: టెల్ అవీవ్ టార్గెట్‌గా ఇరాన్ దాడి

    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అటాక్ దృశ్యాలు

  • Mar 01, 2026 11:50 IST

    కాకినాడ: వేట్లపాలెం ప్రమాద ఘటనపై మంత్రి వాసంశెట్టి సీరియస్‌

    • యజమానికి నోటీసులు జారీ చేయాలని మంత్రి వాసంశెట్టి ఆదేశం

    • ఏపీవ్యాప్తంగా ఫైర్ వర్క్స్ యూనిట్లపై ప్రత్యేక తనిఖీలకు ఆదేశం

    • కార్మికుల భద్రత విషయంలో రాజీపడం: మంత్రి వాసంశెట్టి

  • Mar 01, 2026 11:49 IST

    సిద్దిపేట: విద్యాకమిషన్ నివేదికను రాజకీయం చేయడం సరికాదు: పొన్నం

    • వర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలన్న నివేదికను స్వాగతిస్తున్నా

  • Mar 01, 2026 11:38 IST

    ఖమేనీ మృతితో ప్రతీకారానికి తెగబడుతున్న ఇరాన్

    • అమెరికా బేస్‌క్యాంపులు, మిత్రదేశాలపై దాడులు

    • దోహా, బెహ్రయిన్, ఖతార్, UAE, కువైట్, జోర్డాన్,..

    • సౌదీలోని యూఎస్ సైనిక స్థావరాలపై దాడులు

    • దుబాయ్‌లోని పలుచోట్ల మిసైల్ దాడులు

    • లెబనాన్‌లోని యూఎస్ ఎంబసీపై దాడి

  • Mar 01, 2026 11:36 IST

    ఇరాన్ దాడులతో అప్రమత్తమైన అమెరికా

    • ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు

  • Mar 01, 2026 11:19 IST

    తిరుపతి: దామినీడులో కోర్టు భవనాల సముదాయానికి భూమిపూజ

    • భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ భూమిపూజ

    • రూ.120 కోట్లతో 14.44 సెంట్లు భూమిలో 16 కోర్టు భవనాల సముదాయం

    • వందేమాతరం గీతానికి నిల్చుని గౌరవప్రకటన చేసిన సీజే, ఆహుతులు

  • Mar 01, 2026 10:45 IST

    యాదాద్రి: గుండాలలో భర్తను చంపిన భార్య

    • బిక్షం(64) నిద్రిస్తుండగా సుత్తితో కొట్టి చంపిన భార్య ఉపేంద్ర

  • Mar 01, 2026 10:45 IST

    దుబాయ్‌పై మరోసారి ఇరాన్ దాడులు

    • దుబాయ్ టార్గెట్‌గా దూసుకొస్తున్న ఇరాన్ మిస్సైల్స్

    • ఖమేనీ మృతితో ప్రతీకారానికి తెగబడుతున్న ఇరాన్

    • జెరుసలెంపై ఇరాన్ ఎటాక్, ఒకరు మృతి

    • ఇరాక్, బెహ్రయిన్‌ టార్గెట్‌గా ఇరాన్ దాడులు

    • ఇరాక్ ఎయిర్‌పోర్టు సమీపంలో US ఎయిర్‌బేస్‌పై దాడి

    • బెహ్రయిన్‌లోని ఓ హోటల్‌పైనా దాడి చేసిన ఇరాన్

  • Mar 01, 2026 10:43 IST

    ఖమేనీ మృతిని తీవ్రంగా ఖండించిన ఇరాన్ కేబినెట్

    • ఖమేనీ మృతిని మహానేరంగా అభివర్ణించిన ఇరాన్ కేబినెట్

    • సరైన సమాధానం చెప్పకుండా వదిలేది లేదన్న ఇరాన్ కేబినెట్

    • ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్

  • Mar 01, 2026 10:02 IST

    మహారాష్ట్ర: నాగ్‌పూర్‌లో ఘోర ప్రమాదం

    • బాణసంచా గోడౌన్‌లో పేలుడు

    • 12 మంది మృతి, 15 మందికి గాయాలు

    • పేలుడు ధాటికి భవనం ధ్వంసం

  • Mar 01, 2026 10:01 IST

    శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం

    • దుబాయ్, దోహా, కువైట్, సౌదీఅరేబియా, షార్జా, అబుదాబి,..

    • జెడ్డా, మస్కట్ దేశాలకు వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు రద్దు

    • ఆయా ప్రాంతాల నుంచి రావాల్సిన 21 విమానాలు రద్దు

  • Mar 01, 2026 09:11 IST

    హైదరాబాద్: కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు

    • శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్

    • జల్‌పల్లిలోని SK రాయల్ ఎంటర్‌ప్రైజేస్, షాహీ గోల్డ్ కంపెనీలపై దాడులు

    • ప్రధాన నిందితుడు అబ్దుల్ సత్తార్ సహా నలుగురు అరెస్ట్

    • సింథటిక్ రంగులు, తక్కువ నాణ్యత గల పదార్థాలతో అల్లం తయారీ

    • రూ.10లక్షల విలువైన అల్లం, వెల్లుల్లి, ముడిసరుకు స్వాధీనం

  • Mar 01, 2026 09:06 IST

    కాకినాడ వేట్లపాలెం ఘటనలో 22కు చేరిన మృతుల సంఖ్య

  • Mar 01, 2026 08:52 IST

    అమరావతి: ఈ నెల 13న ఏపీ క్యాబినెట్ సమావేశం

    • ఉదయం 10.30 కు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సమావేశం

    • కేబినెట్ ప్రతిపాదనలు ఈ నెల 11 సాయంత్రం 4 గంటలు లోపు పంపాలని ఆయా శాఖలకు నోట్ జారీ

  • Mar 01, 2026 08:50 IST

    ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల్లో ఇరాన్‌లో 201 మంది మృతి

    • పాఠశాలపై జరిగిన దాడిలో 86 మంది విద్యార్థులు మృతి: ఇరాన్‌

  • Mar 01, 2026 08:47 IST

    తిరుమల: చంద్రగ్రహణం కారణంగా టీటీడీ చర్యలు

    • మంగళవారం 11 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత

    • ఉదయం 9 నుంచి సా.6:30 వరకు ఆలయం మూసివేత

    • 2, 3 తేదీల్లో సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసిన టీటీడీ

    • ఈ నెల 3వ తేదీన వీఐపీ బ్రేక్‌ దర్శనం రద్దు

  • Mar 01, 2026 08:46 IST

    తిరుపతి: దామినీడులో 14.44 సెంట్లు భూమి కోర్టు భవనాలకు కేటాయింపు

    • 16 కోర్టు భవనాల సముదాయం నిర్మాణానికి రూ.120 కోట్లు కేటాయింపు

    • నిర్మాణ పనులకు నేడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ సూర్యకాంత్ భూమిపూజ

  • Mar 01, 2026 08:46 IST

    కాకినాడ: వెట్లపాలెం ప్రమాద మృతుల పోస్ట్‌మార్టం

    • సామర్లకోట సీహెచ్‌సీలో పోస్ట్‌మార్టం నిర్వహణ

    • 11 మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగింత

    • మట్టిఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.25 వేలు చొప్పున సాయం

  • Mar 01, 2026 08:45 IST

    కాకినాడ వేట్లపాలెం ఘటనలో 22కు చేరిన మృతుల సంఖ్య

    • కాకినాడ GGHలో చికిత్సపొందుతూ లోవరాజు మృతి

    • మిగిలిన తొమ్మిది మందికి కొనసాగుతున్న చికిత్స

    • ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడి

  • Mar 01, 2026 08:44 IST

    ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటన

    • గొప్ప, విప్లవ నాయకుడిని కోల్పోయాం: ఇరాన్

    • దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారు

    • పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారు: ఇరాన్

  • Mar 01, 2026 08:42 IST

    దాడులు కొనసాగుతున్నాయి: ఇజ్రాయెల్

    • ఇరాన్‌లో 30 కంటే ఎక్కువ టార్గెట్స్

  • Mar 01, 2026 08:20 IST

    దుబాయ్‌లోని పలు ప్రాంతాలపై ఇరాన్ అటాక్

    • దెబ్బతిన్న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

    • భయాందోళనతో పరుగులు తీసిన ప్రయాణికులు

    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు

  • Mar 01, 2026 08:17 IST

    ప్రకాశం: టంగుటూరులో అగ్నిప్రమాదం

    • గ్రాడ్‌ ఫ్రై ఫిలిప్స్ ఇండియా పొగాకు గ్రేడింగ్ కంపెనీలో చెలరేగిన మంటలు

    • ప్రమాదంలో 2 వేలకు పైగా పొగాకు బేళ్లు దగ్ధం

    • మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

  • Mar 01, 2026 07:23 IST

    ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి

    • ఖమేనీ మృతిని ధృవీకరించిన ఇరాన్ మీడియా

    • ఖమేనీ నివాసం లక్ష్యంగా దాడులు జరిపిన అమెరికా

    • దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనువరాలు మృతి