Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Feb 17 , 2026 | 06:38 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Feb 17, 2026 21:45 IST

    118 మంది ప్రభుత్వ వైద్యుల‌కు ప‌దోన్నతి

    • అమ‌రావ‌తి: 118 మంది ప్రభుత్వ వైద్యుల‌కు ప్రొఫెస‌ర్లుగా ప‌దోన్నతి..

    • ఖాళీల్లో 45 శాతం భ‌ర్తీ.. మొత్తం మంజూరైన పోస్టుల్లో ఇంకా 18 శాతం ఖాళీలు..

    • సూప‌ర్ స్పెషాలిటీ విభాగాల్లో 65 శాతం ఖాళీల‌పై మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్‌ ఆందోళ‌న‌..

    • భ‌ర్తీ చేయ‌డానికి చర్యలు చేప‌ట్టాల‌ని మంత్రి ఆదేశాలు..

  • Feb 17, 2026 21:23 IST

    సీఎం చంద్రబాబుకు శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి లేఖ

    • తిరుమల లడ్డూ ప్రసాదంలో రసాయనాల అంశంపై..

    • స్పందించిన శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ శ్రీపాద..

    • గతంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేశారు..

    • లడ్డూ ప్రసాదంలో రసాయనాలు కలిపి మహాపాపం చేశారు..

    • దోషులను కఠినంగా శిక్షించాలి: : సుభుదేంద్ర తీర్థ శ్రీపాద

    పూర్తి కథనం..

  • Feb 17, 2026 21:17 IST

    మదనపల్లి బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి..

    • చిత్తూరు: మదనపల్లి బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి..

    • బాలిక మృతదేహాన్ని వీరబల్లి మండలం రాగిమనదిన్నెకు తరలింపు..

    • బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసినట్టు పోస్టుమార్టం నివేదిక..

    • నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తాం: రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్‌..

  • Feb 17, 2026 20:15 IST

    నటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో దక్కని ఊరట

    • కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న పిటిషన్ కొట్టివేత..

    • మోహన్‌బాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ మార్చి 3కు వాయిదా..

    • ఫోన్ డేటాను విశ్లేషించి ఫోరెన్సిక్‌ నివేదిక ఇవ్వాల్సి ఉందన్న హైకోర్టు..

    • ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం..

  • Feb 17, 2026 20:09 IST

    పిచ్చికుక్క స్వైర విహారం.. 20మందికి గాయాలు..

    • మార్కాపురం : కంభం ఆర్టీసీ బస్టాండ్ పార్కు వీధిలో పిచ్చికుక్క స్వైర విహారం..

    • ‌20 మందిని కరిచిన పిచ్చికుక్క..

    • గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలింపు..

  • Feb 17, 2026 20:07 IST

    మదనపల్లి బాలిక మృతి కేసుపై డీఐజీ కోయ ప్రవీణ్ ఆరా

    • చిత్తూరు: మదనపల్లి బాలిక మృతి కేసు..

    • మదనపల్లి ఆస్పత్రి దగ్గర నీరుగట్టుపల్లి గ్రామస్తుల ఆందోళన.

    • బాలిక మృతిపై రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ ఆరా..

    • బాలిక హత్య వివరాలు అడిగి తెలుసుకున్న డీఐజీ..

  • Feb 17, 2026 19:48 IST

    తిరుమలలో ఇద్దరు చిన్నారులను ఎత్తుకెళ్లిన సవతి తల్లి..

    • తిరుమల: నాదనీరాజన మండపం వద్ద ఇద్దరు చిన్నారులను ఎత్తుకెళ్లిన సవతి తల్లి..

    • చిన్నారుల తల్లి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు..

    • సవతి తల్లి వద్ద నుంచి చిన్నారులను తల్లికి అప్పగించిన పోలీసులు..

  • Feb 17, 2026 19:40 IST

    వైఎస్‌ హయాంలోనే ఉపాధిహామీ పథకం తీసుకొచ్చారు: షర్మిల

    • వైఎస్‌ హయాంలోనే ఏపీలో ఉపాధిహామీ పథకం తీసుకొచ్చారు: షర్మిల

    • ఉపాధిహామీ పథకానికి కొప్పుల రాజు రూపకర్త..

    • ఉపాధిహామీ పథకంతో వలసలు ఆగాయి..

    • బీజేపీ తెచ్చిన కొత్త పథకం వల్ల గ్రామాల అభివృద్ధి జరగదు: షర్మిల

  • Feb 17, 2026 19:16 IST

    హైదరాబాద్‌: బేగంబజార్‌లో గంజాయి పాల కలకలం

    • పాలల్లో గంజాయి చాక్లెట్స్‌ కలిపి విక్రయాలు..

    • ఉత్తరప్రదేశ్‌కు చెందిన వికాస్‌ శర్మ అరెస్టు..

    • నిందితుడి ఇంట్లో 1,920 గంజాయి చాక్లెట్స్‌ స్వాధీనం..

    పూర్తి కథనం..

  • Feb 17, 2026 19:14 IST

    నకిలీ మద్యం కేసులో నిందితుడికి బెయిల్..

    • విజయవాడ: నకిలీ మద్యం కేసు నిందితుడు సుదర్శన్‌కు బెయిల్‌..

    • ఇబ్రహీంపట్నం, ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ అభియోగాలు..

    • నకిలీ మద్యం కేసు నిందితుడు సెంథిల్‌ కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్..

    • పోలీసుల పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా..

    పూర్తి కథనం..

  • Feb 17, 2026 19:12 IST

    ఏపీ అసెంబ్లీ ఉద్యోగి అరెస్టు..

    • ఏపీ అసెంబ్లీ ఉద్యోగి మునిరాజు అరెస్టు, 15 రోజుల రిమాండ్‌ విధింపు

    • బాలికపై అత్యాచారయత్నంతో పాటు..

    • బలవంతపు వసూళ్లు, బ్లాక్‌మెయిల్‌, ఫోర్జరీ కేసులో అరెస్టు..

    • తల్లీకుమార్తెను రెండేళ్లుగా వేధించిన మునిరాజు..

    • తూనికలు, కొలతల శాఖలో మునిరాజు అక్రమ వసూళ్లు..

  • Feb 17, 2026 18:52 IST

    భారత్-ఫ్రాన్స్ సంబంధాలు అత్యంత కీలకమైనవి: ప్రధాని మోదీ

    • దశాబ్దాలుగా భారత్‌కు ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది..

    • ఫ్రాన్స్ సహాయంతో ఎవరెస్టుకు వెళ్లగలిగే హెలికాప్టర్‌ను తయారుచేస్తాం..

    • భారత్‌లో తయారయ్యే హెలికాప్టర్లు ప్రపంచమంతా ఎగుమతి అవుతాయి: మోదీ

    పూర్తి కథనం..

  • Feb 17, 2026 18:51 IST

    మహబూబాబాద్‌ ప్రగతినగర్‌లో దారుణం..

    • యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉన్మాది..

    • తర్వాత తనకు తానూ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం..

    • మరొకరితో యువతి సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో ఘాతుకం..

    • ఇద్దరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు..

  • Feb 17, 2026 18:07 IST

    ఐర్లాండ్‌ vs జింబాబ్వే: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. సూపర్ 8కి జింబాబ్వే

    • ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా..

    • శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరగాల్సిన ఐర్లాండ్-జింబాబ్వే మ్యాచ్ రద్దు..

    • వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే పోరుకు తెరపడింది..

    పూర్తి కథనం..

  • Feb 17, 2026 17:20 IST

    ఐబొమ్మ రవికి బెయిల్..

    • హైదరాబాద్: రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు..

    • రోజూ సీసీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశం..

    • పాస్‌పోర్ట్‌ను కోర్టులో సరెండర్ చేయాలంటూ ఆంక్షలు..

    • పైరసీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఐబొమ్మ రవి..

    పూర్తి కథనం..

  • Feb 17, 2026 17:12 IST

    నాగర్‌కర్నూల్‌ పరిధిలో చిరుత సంచారం..

    • నాగర్‌కర్నూల్‌: అచ్చంపేట మండలం గుంపన్‌పల్లిలో చిరుత సంచారం..

    • ఎద్దును చంపిన చిరుత, భయాందోళనలో స్థానికులు..

  • Feb 17, 2026 16:28 IST

    అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో అగ్నిప్రమాదం..

    • అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం జంక్షన్ సమీపంలోని కేఆర్ మార్ట్‌లో అగ్నిప్రమాదం

    • ఎగిసిపడుతున్న మంటలు.. అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది..

    • షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదానికి కారణమని అనుమానం..

    • ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది..

    పూర్తి కథనం..

  • Feb 17, 2026 16:20 IST

    అత్తాపూర్ హల్దీరాం స్వీట్స్‌ దుకాణంపై కేసు నమోదు..

    • హైదరాబాద్: అత్తాపూర్ హల్దీరాం స్వీట్స్‌ దుకాణ నిర్వాహకులపై కేసు నమోదు..

    • గడువు ముగిసిన స్వీట్లను విక్రయిస్తున్నట్టు ఫిర్యాదులు..

    • హల్దీరాం స్వీట్స్‌ను FSLకు పంపిన పోలీసులు..

  • Feb 17, 2026 14:40 IST

    రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో విషాద ఘటన..

    • రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన..

    • కాలేజీకి బైక్‌పై వెళ్తున్న ఐటీఐ విద్యార్థి.. టిప్పర్ కింద పడి మృతి..

    • టిప్పర్ లారీని దాటే ప్రయత్నంలో ప్రమాదం..

    • మృతుడు నాదర్గుల్ ప్రాంతానికి చెందిన గొర్రెపోతుల వర్ధన్‌గా గుర్తింపు..

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

  • Feb 17, 2026 14:18 IST

    19న టీకాంగ్రెస్‌ నేతలతో రాహుల్ సమావేశం

    • ఢిల్లీ: ఈనెల 19న టీకాంగ్రెస్‌ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం..

    • హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌..

  • Feb 17, 2026 14:00 IST

    కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

    • చైర్‌ పర్సన్‌గా షాహిన్‌ సుల్తానా, వైస్‌ చైర్‌పర్సన్‌గా లావణ్య.

  • Feb 17, 2026 14:00 IST

    అమరావతి: ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా

    • అధికార - వివక్ష సభ్యుల ఆందోళనలతో సభ వాయిదా వేసిన ఛైర్మన్

  • Feb 17, 2026 13:57 IST

    ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చిట్‌చాట్‌

    • అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్ చేయాలి..

    • అసెంబ్లీకి రావడం ఎమ్మెల్యేల విధి..

    • కొందరు అసలు సభకే రాకుండా జీతభత్యాలు తీసుకోవడం తగదు: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

  • Feb 17, 2026 13:54 IST

    ఖానాపూర్‌లో మరోసారి చైర్మన్‌ ఎన్నిక వాయిదా

    • కోరం లేకపోవడంతో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా.

  • Feb 17, 2026 13:52 IST

    ఢిల్లీ: బిల్‌గేట్స్‌పై దుష్ప్రచారాన్ని ఖండించిన ఫౌండేషన్‌..

    • ఢిల్లీ ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ హాజరవుతున్నారు: ఫాండేషన్‌ ప్రతినిధి

    • గేట్స్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం: ఫాండేషన్‌ ప్రతినిధి

  • Feb 17, 2026 13:06 IST

    రంగారెడ్డి: శంషాబాద్ ధర్మగిరి టెంపుల్‌లో గంజాయి కలకలం

    • శివరాత్రి సందర్భంగా దేవుడికి గంజాయిని ప్రసాదంగా పెట్టిన యువకులు..

    • వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన యువకులు..

    • యువకుల తీరుపై సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన నెటిజన్లు..

    • పోస్టు పెట్టిన యువకుల కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందాలు..

    పూర్తికథనం

  • Feb 17, 2026 13:04 IST

    మంచిర్యాల: క్యాతన్‌పల్లిలో చైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా

    • ఉద్రిక్తతల నేపథ్యంలో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా.

  • Feb 17, 2026 13:04 IST

    జనగామ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

    • లక్కీ డ్రా ద్వారా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక.

  • Feb 17, 2026 12:55 IST

    ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టు స్టే

    • యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశం.

  • Feb 17, 2026 12:09 IST

    రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం

    • చైర్మన్‌గా టేకుల సుదర్శన్‌రెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌గా శ్యామల ఎన్నిక.

    • ఉద్రిక్తత మధ్య సాగిన ఓటింగ్‌ ప్రక్రియ.

    • ఓటింగ్‌ సందర్భంగా పరస్పరం కుర్చీలు విసురుకున్న కౌన్సిలర్లు.

  • Feb 17, 2026 12:08 IST

    సంగారెడ్డి: ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం

    • ఇండిపెండెంట్‌ మద్దతుతో చైర్మన్‌ పీఠం దక్కించుకున్న బీఆర్ఎస్..

    • చైర్‌ పర్సన్‌గా ప్రమీల, వైస్‌ చైర్మన్‌గా హరీశ్‌రెడ్డి..

  • Feb 17, 2026 11:25 IST

    గుంటూరు: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో చోరీ!

    • చింతలపూడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన దొంగలు..

    • 50 తులాల బంగారం, 10 కిలోల వెండి, రూ.లక్ష నగదు అపహరణ..

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

    • చింతలపూడిలో నివాసం ఉంటున్న ఎమ్మెల్యే దూళిపాళ్ల తల్లి..

  • Feb 17, 2026 11:03 IST

    అమరావతి: ప్రారంభమైన ఏపీ శాసన మండలి..

  • Feb 17, 2026 11:00 IST

    కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

  • Feb 17, 2026 10:58 IST

    కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌

  • Feb 17, 2026 10:56 IST

    సుప్రీంకోర్టులో నటి ప్రత్యూష కేసు నిందితుడికి చుక్కెదురు..

    • సిద్ధార్థ రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు..

    • నాలుగు వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశం..

    • పోస్టుమార్టం అన్ ప్రొఫెషనల్‌గా నిర్వహించారన్న సుప్రీంకోర్టు..

  • Feb 17, 2026 10:51 IST

    మంచిర్యాల: క్యాతనపల్లిలో పోలీసుల లాఠీచార్జ్‌

    • మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అడ్డుకున్న పోలీసులు..

    • పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదం, లాఠీచార్జ్‌..

    • పోలీసులపైకి రాళ్లు విసిరిన ఆందోళనకారులు..

  • Feb 17, 2026 10:50 IST

    మహబూబాబాద్: డోర్నకల్ మున్సిపల్‌ చైర్మన్ ఎన్నిక వాయిదా పడే అవకాశం

    • చైర్మన్, వైస్ చైర్మన్ విషయంలో కుదరని ఏకాభిప్రాయం.

    • మంత్రి పొంగులేటి రంగంలోకి దిగినా కొలిక్కిరాని పరిస్థితి.

    • 15 వార్డుల్లో కాంగ్రెస్-11, బీఆర్‌ఎస్‌- 4.

  • Feb 17, 2026 10:50 IST

    మంచిర్యాల: క్యాతనపల్లిలో నాటకీయ పరిణామం..

    • 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్‌ స్వర్ణలత కిడ్నాప్‌!

    • పీఎస్‌లో ఫిర్యాదు చేసిన కుటుంబసభ్యులు.

  • Feb 17, 2026 10:31 IST

    మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి..

    • మున్సిపల్ శాఖపై సమీక్షించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి..

    • మంగళవారం రాత్రి ముంబై వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి..

    • బుధవారం ముంబై నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..

    • ఏఐ సమావేశంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి..

  • Feb 17, 2026 10:28 IST

    మహబూబాబాద్: మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హౌస్ అరెస్ట్

    • తొర్రూరులో ధర్నాకు బయల్దేరిన సత్యవతిని అడ్డుకున్న పోలీసులు.

    • పోలీసులతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల వాగ్వాదం.

  • Feb 17, 2026 10:16 IST

    కరీంనగర్: మానకొండూరులో దారుణం..

    • కొడుకును బండరాయితో కొట్టి చంపిన తండ్రి..

    • మద్యానికి బానిసైన తండ్రీ కొడుకులు..

    • మాటా మాటా పెరిగి గొడవ..

    • కొడుకు శ్రీనివాస్‌పై దాడి చేసి హత్య చేసిన తండ్రి కనకయ్య..

  • Feb 17, 2026 10:09 IST

    కడప: నందలూరులో వైసీపీ నేతల దాష్టీకం..

    • తిమ్మరాజుపల్లిలో వృద్ధురాలు నీలమ్మ ఇంటిని కూల్చివేసిన వైసీపీ నేతలు..

    • స్థలం ఖాళీ చేయాలంటూ వైసీపీ నేతల బెదిరింపులు.

    • టీడీపీ మహిళా కార్యకర్త నీలమ్మ ఇంటిని జేసీబీల సాయంతో కూల్చివేత..

    • వైసీపీ నేతలు జేవీ సుబ్బారెడ్డి సహా 50 మంది అనుచరులపై పీఎస్‌లో ఫిర్యాదు..

  • Feb 17, 2026 10:08 IST

    గంట ఆలస్యంగా ప్రారంభంకానున్న ఏపీ అసెంబ్లీ

    • ఏపీ అసెంబ్లీలో ఆడియో సమస్యలు..

  • Feb 17, 2026 10:07 IST

    మణికొండలో మంజీరా పైప్‌లైన్ బ్లాస్ట్

    • పైప్‌లైన్ బ్లాస్ట్ కావడంతో ఇళ్లలోకి చేరిన నీరు..

    • రెండు అపార్ట్‌మెంట్ల సెల్లార్స్‌లోకి చేరిన నీరు..

    • సెల్లార్‌ నుంచి నీటిని బయటకు తోడిన NDRF, అగ్నిమాపక సిబ్బంది..

  • Feb 17, 2026 10:06 IST

    కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి..

    • మాజీ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి..

    • భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించిన సీఎం..

  • Feb 17, 2026 09:54 IST

    ఏపీ అసెంబ్లీలో ఆడియో సమస్య

    • గంట ఆలస్యంగా ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ..

  • Feb 17, 2026 08:51 IST

    టీ20 వరల్డ్‌ కప్‌లో నేడు 3 మ్యాచ్‌లు..

    • ఉదయం 11 గంటలకు చెన్నైలో కెనడా Vs న్యూజిలాండ్‌ మ్యాచ్..

    • మధ్యాహ్నం 3 గంటలకు పల్లెకెలెలో ఐర్లాండ్‌ Vs జింబాబ్వే..

    • రాత్రి 7 గంటలకు ముంబైలో నేపాల్ Vs స్కాట్లాండ్‌ మ్యాచ్‌..

  • Feb 17, 2026 08:47 IST

    కర్నూలు: పత్తికొండ మండలం గుండు తండా సమీపంలో ఆటో బోల్తా

    • 15 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం.

    • మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలింపు.

    • కూలి పనికి వెళ్తుండగా బోల్తా పడిన ఆటో.

  • Feb 17, 2026 08:45 IST

    జనగామ మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఉత్కంఠ..

    • సోమవారం సభ్యుల ప్రమాణాల తర్వాత గందరగోళం..

    • సభ్యుల ఆందోళనలతో చైర్మన్‌ ఎన్నిక నేటికి వాయిదా..

    • ఎవరికీ మ్యాజిక్‌ ఫిగర్‌ లేకపోవడంతో ఉత్కంఠ..

  • Feb 17, 2026 08:02 IST

    ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 3 చోట్ల మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక

    • కాగజ్‌నగర్‌, ఖానాపూర్, క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక..

    • చైరన్‌ ఎన్నికలో కీలకం కానున్న ఎక్స్‌ అఫీషియో ఓట్లు..

  • Feb 17, 2026 07:43 IST

    నేడు విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • సాయంత్రం 6:10కి నేవల్ ఎయిర్ స్టేషన్ ‘INS డేగా’ వద్దకు చేరుకోనున్న రాష్ట్రపతి..

    • రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న గవర్నర్‌ నజీర్‌..

    • నేవల్‌ బేస్‌లో రాష్ట్రపతి ముర్ము బాంక్వెట్ డిన్నర్..

    • రేపు ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూకు హాజరు..

  • Feb 17, 2026 07:06 IST

    నేడు మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం..

    • రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తోన్న బీఆర్ఎస్ నేతలు..

    • సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ..

  • Feb 17, 2026 06:59 IST

    అమరావతి: నేడు నాలుగో రోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

    • 2026-27 వార్షిక బడ్జెట్‌పై ఉభయ సభల్లో నేటి నుంచి చర్చ..

    • శాసనసభలో నేడు మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..

  • Feb 17, 2026 06:46 IST

    విశాఖలో నేవీ వేడుకలకు సన్నాహాలు..

    • నేడు విశాఖ బీచ్‌ రోడ్‌లో నేవీ విన్యాసాలు..

    • బీచ్‌ రోడ్‌ పరిధిలో ఆంక్షలు..

    • 18, 19 తేదీల్లో పాస్‌లు లేని వాహనాలకు నో ఎంట్రీ..

  • Feb 17, 2026 06:45 IST

    నేటి నుంచి హైదరాబాద్‌లో బయో ఏషియా-2026

    • హైటెక్స్‌లో రెండు రోజుల పాటు సదస్సు..

    • గ్లోబల్‌ టెక్‌-బయో రంగంలో కొత్త ఆవిష్కరణలపై చర్చ..

  • Feb 17, 2026 06:38 IST

    తెలంగాణలో 11 చోట్ల నేడు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక

    • నేడు ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్‌, జనగామ, ఇంద్రేశం, జహీరాబాద్‌..

    • సుల్తానాబాద్‌, ఖానాపూర్, తొర్రూర్‌, డోర్నకల్‌..

    • ఇల్లందు, క్యాతనపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక..