మొజ్తాబా ఖమేనీ ఇరాన్‌లోనే ఉన్నారు.. స్పష్టం చేసిన రష్యా రాయబారి..
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:22 AM
అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మొజ్తాబా ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. ఇరాన్ కొత్త సర్వోన్నత నాయకుడిగా నియమితులై దాదాపు నెల రోజులు గడిచినా, మొజ్తాబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు.
అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మొజ్తాబా ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. ఇరాన్ కొత్త సర్వోన్నత నాయకుడిగా నియమితులై దాదాపు నెల రోజులు గడిచినా, మొజ్తాబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. మరోవైపు మొజ్తాబా చనిపోయారని ఒకసారి, తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని మరోసారి అమెరికా, ఇజ్రాయెల్‌లు ప్రకటనలు చేస్తున్నాయి (Mojtaba Khamenei location).
దాడుల్లో తీవ్రంగా గాయపడిన మొజ్తాబా ప్రస్తుతం రష్యాలోని మాస్కోలో చికిత్స పొందుతున్నారని కూడా వదంతులు వ్యాపించాయి. ఈ ఊహాగానాలన్నింటికీ తెర దించుతూ ఇరాన్‌లోని రష్యా రాయబారి అలెక్సీ డెడోవ్ ఓ ప్రకటన చేశారు. మొజ్తాబా ఖమేనీ ఇరాన్‌లోనే ఉన్నారని అలెక్సీ తెలిపారు. మొజ్తాబా ఖమేనీ దేశంలోనే ఉన్నప్పటికీ, కొన్ని సహేతుకమైన కారణాల వల్ల బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని వెల్లడించారు (Iran Supreme Leader whereabouts).
ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ఇరాన్ దీటుగా స్పందిస్తోంది. పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది (Iran leader news 2026). అమెరికా వెనక్కి తగ్గేలా పక్క ప్రణాళికలతో దాడులు చేస్తోంది. అయినప్పటికీ మొజ్తాబా ఎక్కడా కనిపించకపోవడం ఈ ఊహాగానాలకు కారణంగా నిలిచింది. తండ్రి అయతొల్లా సుప్రీం లీడర్‌గా ఉన్నప్పుడు కూడా మొజ్తాబా చాలా వరకు తెర వెనుకనే ఉంటూ తన ప్రభావాన్ని చూపారు. ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన పదవిలోకి వచ్చినప్పటికీ ఆయన తీరు మారలేదు.
ఇవి కూడా చదవండి..
వాహనదారులకు కీలక అప్డేట్.. టోల్‌ప్లాజాల వద్ద నగదు లావాదేవీలకు స్వస్తి..
ఆ హామీలు ఇస్తే.. యుద్ధం ముగింపునకు రెడీ..: ఇరాన్ అధ్యక్షుడు