జాబిల్లి చెంతకు నాసా ఆర్టెమిస్-2.. వ్యోమగాములతో వెళ్లనున్న చిన్నారి బొమ్మ
ABN , Publish Date - Apr 01 , 2026 | 07:35 PM
జాబిల్లిపై పరిశోధనల్లో మరో అద్భుత ఘట్టానికి తెరలేపనుంది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. చందమామపై పరిశోధన కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్-2’ మిషన్ ప్రయోగం కీలకదశకు చేరుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: జాబిల్లిపై పరిశోధనల్లో మరో అద్భుత ఘట్టానికి తెరలేపనుంది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా(NASA). చందమామపై పరిశోధన కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్-2’ మిషన్ను బుధవారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం) ప్రయోగించనుంది. దశాబ్దాల తర్వాత మళ్లీ మానవుణ్ని చంద్రుడి సమీపంలోకి పంపే నాసా చేపట్టిన ఈ చరిత్రాత్మక ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగంలో వ్యోగగాములతో పాటు ఎనిమిదేళ్ల చిన్నారి తయారుచేసిన ఓ బొమ్మ కూడా చంద్రుని చెంతకు చేరనుంది.
వ్యోమగాములతో పాటు వెళ్లే ఈ బొమ్మను 8 ఏళ్ల అంతరిక్ష ఔత్సాహికుడైన లూకాస యే అనే ఓ ఎనిమిదేళ్ల బాలుడు తయారుచేశాడు. దానికి రైజ్(RISE) అని పేరు పెట్టాడా బుడతడు. రైజ్.. చూడ్డానికి ఓ సాధారణ బొమ్మలా కనిపిస్తున్నప్పటికీ జాబిల్లిపై అది కీలకపాత్రను పోషించనుంది. వ్యోమగాములు భూమి గురుత్వాకర్షణను దాటి ఎప్పుడు వెళ్లారో కచ్చితంగా సంకేతం ఇవ్వడమే దీని ముఖ్య ఉద్దేశం. దానికి అనుగుణంగా దీనిని రూపొందించినట్టు సమాచారం.
భవిష్యత్తు తరాలకు, ముఖ్యంగా చిన్నారులకు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి కలిగించే ఉద్దేశంతో నాసా ఈ బొమ్మను ఎంపిక చేసింది. ‘ఆర్టెమిస్-2’ మిషన్ ద్వారా మొత్తం నలుగురు వ్యోగాములు చంద్రుడి క్షక్ష్యలోకి వెళ్లనున్నారు. సుమారు పదిరోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో వారు చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా వెళ్లి, భవిష్యత్తులో మానవ నివాసానికి గల అవకాశాలను పరిశీలించనున్నారు. ఓరియన్ నౌక ద్వారా సాగే ఈ ప్రయాణం అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త మైలురాయిగా నిలవనుంది.
ఇవి కూడా చదవండి..
ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్
కాంగ్రెస్ ప్రిన్స్‌కు వందోసారి కూడా ఓటమి ఖాయం: మోదీ