దేవునికి దణ్ణం పెట్టుకునేటప్పుడు ఎందుకు కళ్లు మూసుకుంటామో తెలుసా..?
ABN , Publish Date - Apr 12 , 2026 | 07:45 AM
సాధారణంగా ఇంట్లో కానీ.. గుడిలో కానీ.. దేవునికి దణ్ణం పెట్టుకునే సమయంలో కళ్లు మూసుంటాము. దాదాపుగా నూటికి 99 శాతం మంది చేతులు జోడించి, తల వంచి, కళ్లు మూసుకుని దేవుడికి దణ్ణం పెట్టుకుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఇంట్లో కానీ.. గుడిలో కానీ.. దేవునికి దణ్ణం పెట్టుకునే సమయంలో కళ్లు మూసుకుంటాము. దాదాపుగా నూటికి 99 శాతం మంది చేతులు జోడించి, తల వంచి, కళ్లు మూసుకుని దేవుడికి దణ్ణం పెట్టుకుంటారు. ఇలా మనకు తెలియకుండానే అప్రయత్నంగా చేస్తామన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఎందుకు చేస్తామనే విషయం ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా?
కళ్లు మూసుకోవడం వల్ల బాహ్య వాతావరణ ప్రభావానికి లోనవ్వం. మన మసస్సును దేవునిపై కేంద్రీకరించగలం. మన మెదడు సహజంగానే మన చుట్టూ ఉన్న వాటిపై.. వస్తువులు, కాంతి, కదలికల వైపు కదులుతుంది. దీంతో ఏకాగ్రతకు భంగం కలిగే అవకాశం ఉంది. కళ్లు మూసుకోవడం వల్ల చిన్న చిన్న విషయాలు మన ఏకాగ్రతకు ఏ మాత్రం భంగం కలిగించవు.
అంతేకాదు.. దేవుని ఎదుట కళ్లు మూసుకోవడం వల్ల దేవుడిని ప్రార్థించడం సులభతరం అవుతుంది. అలాగే మన ఆలోచనలు, మనస్సును దేవునిపై లగ్నం చేయగలం.
కళ్లు మూసుకోవడం వల్ల ఆ క్షణంలో మన దు:ఖాలు, కోరికలను వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుంది. ఆ క్షణాల్లో మనకు వ్యక్తిగత సమయం లభిస్తుంది. మన మనస్సులోని కోరికలు దేవుడికి తెలియజేశామనే భావన కలుగుతుంది.
దేవునికి ప్రార్థన అంటే.. కేవలం మాటలు పలకడం కాదు. అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. మనం కళ్లు మూసుకుని తల వంచి దేవుణ్ణి ప్రార్థించడం.. ఒక గొప్ప శక్తి సన్నిధిలో ఉన్నామని అంగీకరించడమే అవుతుంది. దేవుడు గొప్పవాడు.. ఆయన ముందు అల్పులమని మనం చెబుతున్నట్లు అవుతంది. ఇది వినయం, విధేయతకు ప్రతిక. మనం బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి.. దేవునిపై దృష్టి పెడతాం. కొంతసేపు ఏకాగ్రతతో ఉంటాం.
ఇలా కళ్లు మూసుకోవడం.. మీ మనస్సులో దేవుని రూపంతోపాటు ఆయన నామాన్ని గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. మీరు కళ్లు మూసుకుంటే.. ఏ బాహ్య దృశ్యాలు చూడలేరు. మీ మెదడు సులభంగా దేవుని రూపాలను గుర్తుంచుకునేలా చేస్తుంది. దీంతో దేవునికి మరింత దగ్గరవుతారు.
మనం కళ్లు మూసుకుంటే.. మన మెదడు నెమ్మదిగా ప్రశాంత స్థితిలోకి వెళ్తుంది. ధ్యానం, దేవుని నామ స్మరణ మనస్సుకు విశ్రాంతినిస్తాయి. ఇది మన తప్పులను నివారించడానికి ఒక మార్గాన్ని సృష్టిస్తుంది.
మనం దేవునికి దణ్ణం పెట్టుకునే సమయంలో మనకు తెలియకుండానే కళ్లు మూసుకుని తల వంచుతాం. దీనికి మరో కారణం కూడా ఉంది. మన చిన్నప్పటి నుంచే పెద్దలు..మనం దేవునికి ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తారు. ఇది మనకు అలవాటుగా మారుతుంది. మనం దేవునికి దణ్ణం పెట్టుకునే సమయంలో అప్రయత్నంగా కళ్లు మూసుకుని చేతులు జోడించి నమస్కరిస్తాం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్వెస్టర్లను భయపెట్టేందుకే ‘మావిగన్’: ఏబీవీ
For More Devotional News And Telugu News