Share News

అమెరికాలో తెలుగు యువకుడు సాయి శ్రీహరి కృష్ణ మృతి..

ABN , Publish Date - Apr 12 , 2026 | 10:34 AM

అమెరికాలోని కాలిఫోర్నియాలో తెలుగు యువకుడు మృతిచెందాడు. విజయనగరం జిల్లా వాసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు.

అమెరికాలో తెలుగు యువకుడు సాయి శ్రీహరి కృష్ణ మృతి..
Software Engineer Sai Srihari krishna

విజయనగరం: అమెరికాలోని కాలిఫోర్నియాలో తెలుగు యువకుడు మృతిచెందాడు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సాయి శ్రీహరికృష్ణ.. అగ్రదేశంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. జన్మదిన వేడుకల సందర్భంగా స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు కాలిఫోర్నియాలోని ఓ జలపాతం వద్దకు వెళ్లాడు. నీటిలోకి దిగి ఈత కొడుతుండగా ప్రవాహం మధ్యలో సుడిగుండం ఏర్పడింది.


సుడిగుండంలో పడి సాయి శ్రీహరికృష్ణ కొట్టుకుపోయాడు. స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మరణవార్తతో పిరిడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

రెండు రోడ్డు ప్రమాదాలు.. ఒకరి మృతి, 15 మందికి గాయాలు..

తిరుచానూరు పద్మావతి ఆలయ వాహన బేరర్లపై వైసీపీ బ్యాచ్ దాడి..

Updated Date - Apr 12 , 2026 | 10:42 AM