Home » Vizianagaram
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులను ఎత్తేసిన పరిస్థితి ఏర్పడిందని హోం మంత్రి అనిత విమర్శించారు. వైసీపీ వాళ్లు వాటాలు, భాగస్వామ్యం అడిగారు కాబట్టి చాలా ప్రాజెక్టులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లల్లో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.
భారత సైన్యంలో అగ్నివీర్ (జనరల్/ టెక్నికల్) ఉద్యోగాల భర్తీకి పురుషుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ సెట్విజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డి.విశ్వేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన వారు వచ్చే నెల ఒకటిలోగా వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
ఎస్.కోటకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఐవీఆర్ఎస్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మీతో మర్యాదగా ప్రవర్తిస్తున్నారా? అంటూ ఔనైతే ఒకటి, కాదయితే రెండు నొక్కండంటూ చెప్పింది. ఆయన జవాబు ఇవ్వకపోవడంతో మళ్లీ రింగ్‌యింది.
ఏపీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి సీహెచ్‌సీలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
గతంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరించిన తీరును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎండగట్టారు. విమానాశ్రయాన్ని అడ్డుకునేందుకు రైతులను రెచ్చగొట్టి కోర్టుకు వెళ్లారని ఆగ్రహించారు.
భోగాపురం విమానాశ్రయ అన్ని పనులు పూర్తి అయ్యాయని చెప్పటం కోసమే ఈ రోజు టెస్ట్ ఫ్లైట్ డ్రైవ్ జరిగిందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. జీఎంఆర్, మాన్సాస్ ఏరోస్పేస్ ఎడ్యుసిటీ ప్రాజక్ట్ ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో గేమ్ ఛేంజర్ కాబోతున్నాయని వివరించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం దిగింది. ఆదివారం ఉదయం10:15 గంటలకు తొలి బిజినెస్ ఫ్లైట్ ల్యాండింగ్ అయింది.
ఈ రోజు (ఆదివారం) ట్రయల్ రన్‌గా బిజినెస్ ఫ్లయిట్ మరికొద్దిసేపట్లో భోగాపురం విమానాశ్రయంలో దిగనుంది. సరిగ్గా ఉదయం 10:15 నిమిషాలకు విమానం విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన రంగానికి కీలక మైలురాయిగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయం అత్యంత ఆధునిక సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా తయారైనట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్, సీఈఓ రణబీర్ సంయుక్త ప్రకటనలో తెలిపారు.