Share News

తిరుచానూరు పద్మావతి ఆలయ వాహన బేరర్లపై వైసీపీ బ్యాచ్ దాడి..

ABN , Publish Date - Apr 12 , 2026 | 08:03 AM

తిరుపతి జిల్లా తిరుచానూరులో వైసీపీ మూక రెచ్చిపోయింది. తిరుచానూరు తూర్పు మాడ వీధిలో పలువురిపై వైసీపీ గ్యాంగ్ దాడికి పాల్పడింది. శనివారం రాత్రి స్వామివారి గజవాహన సేవ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.

తిరుచానూరు పద్మావతి ఆలయ వాహన బేరర్లపై వైసీపీ బ్యాచ్ దాడి..
YSRCP Activists Attack

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ మూకలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ప్రతి రోజూ వివాదాలు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వివాదాలు సృష్టిస్తూనే ఉంటున్నారు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు. తరచుగా టీడీపీ కార్యకర్తలు, నేతలపై దాడులకూ తెగపడుతున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపైనా దాడులకు యత్నించి విమర్శలపాలయ్యారు. ఈ ఘటనలో పలు జిల్లాల్లో వారిపై కేసులు నమోదు అయ్యాయి. తాజాగా తిరుపతి జిల్లాలోనూ వైసీపీ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఏకంగా పద్మావతి ఆలయ సిబ్బందిపైనే దాడి చేశారు.


తిరుపతి జిల్లా తిరుచానూరులో వైసీపీ మూక రెచ్చిపోయింది. తిరుచానూరు తూర్పు మాడ వీధిలో పలువురిపై వైసీపీ గ్యాంగ్ దాడికి పాల్పడింది. శనివారం రాత్రి స్వామివారి గజవాహన సేవ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్రవాహనం సైడ్ ఇచ్చే విషయంలో వివాదం చెలరేగింది. దీంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. పద్మావతి అమ్మవారి ఆలయ వాహన బేరర్లను చితకబాదారు. ఈ ఘటనలో ఆలయ బేరర్లు ముగ్గురికి గాయాలు అయ్యాయి. బాధితులు వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. అయితే, వైసీపీ బ్యాచ్ తరుచూ ఇలానే ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారి చర్యలను కట్టడి చేసి శాంతిభద్రతలు కాపాడాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రెండు రోడ్డు ప్రమాదాలు.. ఒకరి మృతి, 15 మందికి గాయాలు..

ప్రతి కార్యకర్తకూ భద్రత

Updated Date - Apr 12 , 2026 | 08:31 AM