పెరుగుతున్న పసిడి ధరలు.. స్థిరంగా వెండి!
ABN , Publish Date - Apr 12 , 2026 | 06:32 AM
భారత్‌లో గత రెండు మూడు రోజులుగా పసిడి ధరలు ఓ మోస్తరు స్థాయిలో పెరిగాయి. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. మరి హైదరాబాద్‌లో నేటి పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలో ఓ మోస్తరు పెరుగుదల కనిపించింది. యూఎస్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, డాలర్ బలహీనపడటం వంటివి బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఆదివారం (ఏప్రిల్ 12) ఉదయం 6.30 సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,840గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,100గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.2.65 లక్షల వద్ద కొనసాగుతోంది.
గ్లోబల్ మార్కెట్స్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 4,738 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఔన్స్ వెండి 75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కాల్పుల విరమణ నేపథ్యంలో కొంత సానుకూల సెంటిమెంట్ నెలకొన్నప్పటికీ ఇరు దేశాలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుండటంతో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వివిధ నగరాల్లో 10 గ్రాముల బంగారం (24క్యారెట్లు, 22 క్యారెట్లు) ధరలు
చెన్నై: ₹1,53,820; ₹1,41,000
ముంబై: ₹1,52,840; ₹1,40,100
న్యూఢిల్లీ: ₹1,52,990; ₹1,40,250
కోల్‌కతా: ₹1,52,840; ₹1,40,100
బెంగళూరు: ₹1,52,840; ₹1,40,100
హైదరాబాద్: ₹1,52,840; ₹1,40,100
విజయవాడ: ₹1,52,840; ₹1,40,100
కేరళ: ₹1,52,840; ₹1,40,100
పుణె: ₹1,52,840; ₹1,40,100
వడోదరా: ₹1,52,890; ₹1,40,150
అహ్మదాబాద్: ₹1,52,890; ₹1,40,150
వెండి (కిలో) ధరలు ఇలా
చెన్నై: ₹2,65,000
ముంబై: ₹2,60,000
న్యూఢిల్లీ: ₹2,60,000
కోల్‌కతా: ₹2,60,000
బెంగళూరు: ₹2,60,000
హైదరాబాద్: ₹2,65,000
విజయవాడ: ₹2,65,000
కేరళ: ₹2,65,000
పుణె: ₹2,60,000
వడోదరా: ₹2,60,000
అహ్మదాబాద్: ₹2,60,000
ఈ వార్తలనూ చదవండి:
రిటైర్‌మెంట్ ప్లాన్.. ముందస్తు ప్రణాళికతోమలి వయసుకు భరోసా
ఎన్‌బీఎఫ్‌సీ-యూఎల్ వర్గీకరణకు ఆర్బీఐ కొత్త విధానం