Share News

అమరావతి రాజధాని కాదు.. ఆంధ్రప్రజల భవిష్యత్: ఎమ్మెల్యే వెంకట్రాజు

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:51 PM

వైసీపీ హయాంలోని జంగిల్ రాజ్ నుంచి రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం బయటపడేసి స్థిరత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

అమరావతి రాజధాని కాదు.. ఆంధ్రప్రజల భవిష్యత్: ఎమ్మెల్యే వెంకట్రాజు
AP Assembly Session

అమరావతి, ఫిబ్రవరి 12: ఏపీ శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు (MLA Maddipati Venkatraju) ఈ చర్చను ప్రారంభించారు. ఈ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 20 నెలలు అయిన సందర్భంగా, గవర్నర్ తన ప్రసంగంలో ప్రభుత్వ లక్ష్యాలు, విజయాలను ప్రస్తావించారని ఆయన అన్నారు. వైసీపీ హయాంలోని 'జంగిల్ రాజ్' నుంచి రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం బయటపడేసి స్థిరత్వం తీసుకొచ్చిందని వెంకట్రాజు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వంటి అనేక అంశాల్లో పురోభివృద్ధి కనిపిస్తోందని తెలిపారు.


అనేక రంగాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. తనను తాను సామాజిక సేవకుడిగా ప్రకటించుకున్నారని ఆయన చెప్పారు. ఎడారి ప్రాంతాలను కూడా ఉద్యానవనాలుగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో విద్యా విధానం ఒడిదుడుకులు ఎదుర్కొందని.. గత ప్రభుత్వ పాలకుల వ్యవస్థల విధ్వంసం వల్ల అనేక కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ఆయన విమర్శించారు.


వైసీపీ హయాంలో మహిళల భద్రత, శాంతిభద్రతలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయని ఎమ్మెల్యే వెంకట్రాజు ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం 'సూపర్ సిక్స్' పేరుతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అమరావతి రాజధాని మాత్రమే కాదని.. ఆంధ్రప్రజల భవిష్యత్తు అని ఆయన అన్నారు. నదుల అనుసంధానం, సాగునీరు అందజేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

సభలో వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆవేదన

ఏపీ లిక్కర్ స్కామ్.. రాజ్‌ కసిరెడ్డి రెగ్యులర్ బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 01:10 PM