Share News

టీడీపీ హైకమాండ్ సీరియస్.. స్పందించిన ఎమ్మెల్యే

ABN , Publish Date - Apr 01 , 2026 | 06:26 PM

పల్నాడు ఎస్పీ కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ సిహెచ్.అరవిందబాబు వ్యవహరం తీరుపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే అరవిందబాబుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు.

టీడీపీ హైకమాండ్ సీరియస్.. స్పందించిన ఎమ్మెల్యే
TDP MLA Dr Chadalavada Aravinda babu

అమరావతి, ఏప్రిల్ 01: పల్నాడు ఎస్పీ కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ సిహెచ్.అరవిందబాబు వ్యవహరం తీరుపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే అరవిందబాబుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ మేరకు బుధవారం నరసరావుపేట ఎమ్మెల్యేకు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి ఆదేశించారు. మంగళవారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో చదలవాడ అరవిందబాబు వ్యవహరించిన తీరుపై పార్టీ హైకమాండ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.


మంగళవారం ఎమ్మెల్యే అరవిందబాబుకు ఫోన్ చేసినా స్పందించకపోవడం పట్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. న్యాయ సలహాదారు పోస్ట్‌కు సిఫార్స్ చేస్తే.. అధికారులు ఆమోదించకుంటే.. ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్‌ దృష్టికి తీసుకు రావాలని.. అంతేకానీ ఇలా చేస్తే ఎలా అంటూ ఎమ్మెల్యే తీరుపై హైకమాండ్ ఆగ్రహం చెందినట్లు సమాచారం. ఈ అంశంపై లిఖిత పూర్వక వివరణ ఇస్తానని పల్లాకు అరవిందబాబు చెప్పారు. మరోవైపు నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబుు రెండు, మూడు రోజుల్లో అమరావతికి పిలిపించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశించిరని సమాచారం.


ఇంతకీ ఏం జరిగింది..?

పల్నాడు జిల్లా పోలీస్ సెల్ న్యాయ సలహాదారుగా తాను సూచించిన రామినేని ప్రసాద్ పేరును ఎందుకు ఆమోదించంలేదని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదవలవాడ అరవిందబాబు వాగ్వాదానికి దిగారు. మంగళవారం మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయానికి టీడీపీ ఎమ్మెల్యే వచ్చారు. న్యాయ సలహదారుగా నియమించాలని ఎనిమిది నెలల క్రితం లేఖ పంపితే.. నేటికి దానిపై సంతకం చేయలేదన్నారు. దీనిపై విచారణ జరిపి సంతకం చేస్తానని ఆయనకు ఎస్పీ తెలిపారు.


ఆయన మాటలను టీడీపీ ఎమ్మెల్యే లక్ష్యపెట్టక.. రామినేని ప్రసాద్‌ను నియమిస్తూ ఆర్డర్ కాపీ తనకు ఇచ్చే వరకు ఎస్పీ కార్యాలయం నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. దాదాపు 10 గంటల పాటు ఎస్పీ చాంబర్‌లోనే ఎమ్మెల్యే ఉండిపోయారు. ఆ సమయంలో మంత్రుల కార్యాలయాల నుంచి ఫోన్లు వచ్చినా ఎమ్మెల్యే స్పందించలేదని తెలుస్తోంది. అలాగే ఆర్డీవో కార్యాలయంలో సైతం ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఇదే విధంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఎమ్మెల్యే వ్యవహరశైలిపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

వాణిజ్య సిలిండర్ ధర పెరిగిన వేళ.. డొమెస్టిక్ గ్యాస్‌ ధరపై కేంద్రం క్లారిటీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే.. కఠిన చర్యలు: కేంద్రం

For More AP News And Telugu News

Updated Date - Apr 01 , 2026 | 06:44 PM