రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:43 AM
భారతీయ సంస్కృతిలోనూ, ధర్మ పరిరక్షణలోనూ అత్యంత విశిష్ఠమైన పర్వదినం శ్రీరామ నవమి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి, మార్చి27: భారతీయ సంస్కృతిలోనూ, ధర్మ పరిరక్షణలోనూ అత్యంత విశిష్ఠమైన పర్వదినం శ్రీరామ నవమి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముని గొప్పతనాన్ని, ఆయన చూపిన ధర్మ మార్గం అందరికీ ఆదర్శం అన్నారు. సమాజంలో నైతిక విలువలు పెరగాలంటే రాముడి ఆశయాలే మార్గదర్శకమని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సందేశంలో శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ‘శ్రీరాముడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఒక ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడు. స్వామి అవతరించిన రోజున, అలాగే కళ్యాణం జరిగిన ఈ పవిత్ర ఘడియల్లో మనం శ్రీరామ నవమిని ఎంతో వైభవంగా జరుపుకొంటున్నాం. శ్రీరాముడి పాలన అంటేనే ప్రజారంజక పాలన. అటువంటి రామరాజ్యాన్ని మళ్లీ స్థాపించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. శ్రీరామచంద్రమూర్తి సుగుణాలను పుణికిపుచ్చుకుని, ప్రతి ఒక్కరూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి. ఆ శ్రీరాముడి కృపాకటాక్షాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’లో ట్వీట్ చేస్తూ.. ‘ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రుడు. సుపరిపాలనకు శాశ్వత నమూనా రామరాజ్యం. లోక కల్యాణం కోసం సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగాలని ప్రార్థిస్తున్నాను. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు’ అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి అనిత ‘ఎక్స్’ లో ట్వీట్ చేస్తూ.. ‘ఆ సీతారాముల ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతులతో వర్ధిల్లాలని, ధర్మబద్ధమైన పాలనతో మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆదర్శప్రాయమైన రామరాజ్య స్థాపన దిశగా మనమందరం అడుగులు వేద్దాం. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి...
మార్కాపురం బస్సు ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై ఏపీ స్పీకర్ క్లారిటీ
Read Latest AP News