STRIKE: సార్వత్రిక సమ్మె విజయవంతం
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:31 PM
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురువారం విజయవంతమైంది. సీఐటీ యూ జాతీయ కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ, రైతుసంఘం, చేనేత కార్మిక సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పుట్టపర్తి, ధర్మవరం, కదిరి పట్టణాలతో పాటు మండలకేంద్రాల్లోనూ భారీ ర్యాలీలు నిర్వహించారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురువారం విజయవంతమైంది. సీఐటీ యూ జాతీయ కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ, రైతుసంఘం, చేనేత కార్మిక సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పుట్టపర్తి, ధర్మవరం, కదిరి పట్టణాలతో పాటు మండలకేంద్రాల్లోనూ భారీ ర్యాలీలు నిర్వహించారు. ధర్మవరంలో రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అయూబ్‌ఖాన, ఏపీచేనేత కార్మిక సంఘం జిల్లా నాయకుడు ఎస్‌హెచబాషా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగార్జున, పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర కాంగ్రెస్ నాయకులు తుంపర్తి పరమేశ, సీఐటీయూ నాయకులు ఎల్ ఆదినా రాయణ, జేవీరమణ, రఫీ, షెక్షావలి తదితరులు పాల్గొన్నారు. లేబర్ యాక్ట్‌కు వ్యతిరేకంగా ధర్మవరం ఆర్టీసీ డిపో ఎదుట ఈయూ రీజనల్ నాయకులు బుల్లె ఆదినారాయణ ఆధ్వర్యంలో ఆ యూనియన నాయకు లు ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
అలాగే సీపీఐ నియోజక వర్గ కార్యదర్శి ముసుగు మధు, చేతి వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షుడు జింకా చలపతి ఆధ్వర్యంలో కళాజ్యోతి సర్కిల్‌లో నిరసన తెలిపారు.
- కదిరి పట్టణంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, సీపీఐ, సీపీఎం నాయకులు మధునాయక్, పవన, లియాకత, మాబున్నీషా, సుశీల, జగన మోహన, తిరుపాలు, జనార్దన తదితరులు పాల్గొన్నారు.
- తాడిమర్రి, ముదిగుబ్బ, ఓబుళదేవర చెరువు తదితర మండల కేంద్రాల్లో సార్వత్రిక సమ్మెను నిర్వహించారు. ఈ సమ్మెలో వివిధ కార్మిక సంఘాలతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....