Share News

SEWAGE: రోడ్లపైనే మురుగునీటి ప్రవాహం

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:25 PM

గ్రామాలే దేశానికి పట్టుగొ మ్మలు అనే నానుడి అం దరికీ తెలిసిందే. అయితే పలు గ్రామాలు ఇ ప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. అందులో మండలపరిధి లోని కురలమాల పంచాయతీ ఒకటి. ఈ పంచాయతీలో కురమాల, గంగాపురం, చౌటకుంటపల్లి గ్రామాలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధా రపడి ఉన్నాయి

SEWAGE: రోడ్లపైనే మురుగునీటి ప్రవాహం
Sewage flowing on the road in Chautakuntapalli

- అర్ధాంతరంగా ప్రభుత్వ భవనాల నిర్మాణం

- అరకొరగా సీసీరోడ్లు, వీధిలైట్లు

- కురుమాల పంచాయతీలో సమస్యలు

నల్లమాడ, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): గ్రామాలే దేశానికి పట్టుగొ మ్మలు అనే నానుడి అం దరికీ తెలిసిందే. అయితే పలు గ్రామాలు ఇ ప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. అందులో మండలపరిధి లోని కురలమాల పంచాయతీ ఒకటి. ఈ పంచాయతీలో కురమాల, గంగాపురం, చౌటకుంటపల్లి గ్రామాలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధా రపడి ఉన్నాయి. బోరుబావులున్న పరిస్థితి అటుంచితే.. అరకొరగా వరా ్షధార భూములున్న రైతుల జీవనం దుర్భరంగా ఉంది. దీంతో ఉపాధి కోసం కొన్ని కుటుంబాలు బెంగళూరు తదితర నగరాలు, ఇతర పట్టణా లకు వలసలు వెళ్తున్నాయిు. ముఖ్యంగా కురమాల పంచాయతీలోని గ్రామాల్లో కనీస సౌకర్యాల కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చే స్తోంది. అరకొరగా సీసీరోడ్లు, వీఽధిలైట్లు ఏర్పాటు చేశారు. పంచాయతీ లోని చౌటకుంటపల్లిలో మురుగునీటి కాలువలు లేవు. దీంతో మురుగు నీటితో పాటు కొళాయిల నుంచి వచ్చే నీరు అనునిత్యం రోడ్లుపై వృథా గా పారుతోంది. దీంతో రోడ్లు పాచిపట్టి, నడవాలంటే కూడా ఎక్కడ జా రిపడతామో అని ప్రజలు భయం భయంగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది.


అంతేగాకుండా గ్రామంలో పంచాయతీ పాలకులు, వైద్య ఆరో గ్య శాఖ వారు పారిశుధ్య పనులు, దోమల నివారణ చర్యలు చేపట్టడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. దీంతో ప్రజారోగ్యానికి ముప్పువాటిలే ప్రమాదముందని అంటున్నారు. ఇక కురుమాలలో ఐదేళ్ల క్రితం గ్రామ సచివాలయ నిర్మాణానికి పనులు ప్రారంభించా రు. ఇప్పటికీ గోడలు, స్లాబ్‌కే పరిమితమై దిష్టిబొమ్మలా దర్శనమిస్తోంది. అలాగే రైతు సేవా కేంద్రం, విలేజీ హెల్త్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణం పునాదులకే పరిమిత మయ్యాయి. దీంతో పాత పంచాయతీ కార్యాల యంలోనే సచివాలయం నిర్వహిస్తున్నారు. అందులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గంగాపురంలోనే రోడ్లు, వీధిలైట్ల సమస్య నెలకొంది. కురమాల పంచాయతీలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఇప్పటికైనా పాలకులు, అధికారులు చొరవ చూపాలని పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 12 , 2026 | 11:25 PM