FESTIVALS: తిమ్మమాంబ ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:28 PM
మండలపరిధి లోని గూటిబైలు గామంలో వెలసిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహాశివరాత్రి పండుగ సందర్భంగా మూడురోజుల పాటు చేపట్టిన ఉత్సవాల ఏర్పాట్లను గురువారం అధికారులు, నాయకు లు పరిశీలించారు. ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు హాజరువుతారని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముందస్తు పనులు చేప డుతున్నారు.
నంబులపూలకుంట, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మండలపరిధి లోని గూటిబైలు గామంలో వెలసిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహాశివరాత్రి పండుగ సందర్భంగా మూడురోజుల పాటు చేపట్టిన ఉత్సవాల ఏర్పాట్లను గురువారం అధికారులు, నాయకు లు పరిశీలించారు. ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు హాజరువుతారని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ముందస్తు పనులు చేప డుతున్నారు. వేదికను ఏర్పాటు ప్రాంతంలోసమతలంగా ఉన్న ప్రాంతం లో ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే మరుగుదొడ్లు, స్నానపు గదులు, వసతి భవనాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దేవేంద్రనాయక్, సీనియర్ అసిస్టెంట్ షేక్షా, టీడీపీ మండల కన్వీనర్ శ్రీరాములనాయుడు, సింగల్‌విండో అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయుడు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవాలకు తరలిరండి : ఎంపీపీ
గాండ్లపెంట: శివరాత్రి సందర్భంగా నిర్వహించే తిమ్మమాంబ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎంపీపీ సోమశేఖర్‌రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ బుర్రు వెంకటప్రసాద్ గురువారం పిలుపురు. మం డల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మమర్రిమాను ఉత్సవాలను ఈ సంవత్సరం ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఘనంగా ని ర్వహిస్తున్నామని, భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నా రు. ఈ ఉత్సవాలను తిలకించి విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క రూ హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ శివప్ప నాయుడు, సింగిల్ విండో అధ్యక్షుడు రామాంజులు రెడ్డి, సిద్దారెడ్డి, చంద్ర, ఆనంద్, అక్రమ్, నరసింహులు, లోకేష్, ఆసీఫ్, రెడ్డి, నాయక్, యూనిస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....