UTF: హామీలు అమలుకాకపోతే ప్రతిఘటనే: యూటీఎఫ్
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:37 PM
ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమ లుచేయకపోతే ప్రతిఘటన తప్పదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు శెట్టిపి జయచంద్రారెడ్డి, దేవేంద్రమ్మ హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ నాయకులు గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.
పుట్టపర్తి టౌన, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమ లుచేయకపోతే ప్రతిఘటన తప్పదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు శెట్టిపి జయచంద్రారెడ్డి, దేవేంద్రమ్మ హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ నాయకులు గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపాధ్యా యుల సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో తలపెట్టిన రణభేరి కార్యక్రమానికి పెద్దఎత్తున ఉపాధ్యాయులు తరలిరావాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రమణయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రామకృష్ణ నాయక్, జిల్లా గౌరవా ధ్యక్షులు భూతన్న, ఉపాధ్యక్షులు జీహెచ.బాబు, కోశాధికారి లక్ష్మీనారా యణ, సీనియర్ నాయకులు సుధాకర్, నారాయయణస్వామి, మహం తేశ్వర, నరసింహప్ప, నరేష్కుమార్, అమర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....