PM Modi: ఆపరేషన్‌ సిందూర్‌‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jul 29 , 2025 | 08:19 PM

ఆపరేషన్‌ సిందూర్‌‌ గురించి ప్రధాని మోదీ పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపమని ప్రపంచంలో ఏ నేత తమకు ఫోన్‌ చేయలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అంతేకాకుండా..

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ఏ నేత ఆపరేషన్‌ సిందూర్‌ను ఆపాలని తమకు ఫోన్‌ చేయలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మే9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తనకు ఫోన్‌ చేశారని అయితే తాను బిజీగా ఉండి ఫోన్ లిప్ట్ చేయలేదని చెప్పారు. కానీ, వాన్స్‌ మళ్లీ తనకు ఫోన్‌ చేసి.. భారత్‌పై పాక్ భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడి చేయబోతోందని చెప్పాడు. అయితే, పాక్‌ ఈసారి దాడి చేస్తే మరింత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా కొనసాగుతునే ఉందని చెప్పానన్నారు.

Updated at - Jul 29 , 2025 | 08:25 PM