Labubu Dolls: భయపెట్టే బొమ్మలకు.. భలే క్రేజ్.. కారణమేంటంటే..
ABN, Publish Date - Jul 30 , 2025 | 07:46 AM
కుందేలు లాంటి చెవులు, పెద్ద కళ్లు, షార్ప్‌గా ఉండే పళ్లు.. అన్నీ కలిసి చూడ్డానికి ఓ రాక్షసిలాగా కనిపించే లబూబూ డాల్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పిల్ల రాక్షసి బొమ్మలు ఇటీవల చాలా ట్రెండ్ అయ్యాయి. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కేవలం పిల్లలు మాత్రమే కాకుండా పెద్ద వారు కూడా ఈ బొమ్మలను కలెక్ట్ చేస్తున్నారు.
కుందేలు లాంటి చెవులు, పెద్ద కళ్లు, షార్ప్‌గా ఉండే పళ్లు.. అన్నీ కలిసి చూడ్డానికి ఓ రాక్షసిలాగా కనిపించే లబూబూ డాల్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పిల్ల రాక్షసి బొమ్మలు ఇటీవల చాలా ట్రెండ్ అయ్యాయి. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కేవలం పిల్లలు మాత్రమే కాకుండా పెద్ద వారు కూడా ఈ బొమ్మలను కలెక్ట్ చేస్తున్నారు. ఈ బొమ్మలను బాక్సుల్లో ప్యాక్ చేస్తారు. కొనే వారికి ఎలాంటి రంగు, ఏ డిజైన్ బొమ్మలు వస్తాయనే విషయం ఓ సస్పెన్స్ అన్నమాట. 70 బొమ్మల్లో ఒకటి చాలా అరుదైన బొమ్మ ఉండేలా వీటిని తయారు చేస్తుంటారు. దీంతో ఆ అరుదైన బొమ్మ కోసం కలెక్టర్స్ ఎక్కువ మొత్తంలో ఈ బొమ్మలను కొనుగోలు చేస్తుంటారు.
Updated at - Jul 30 , 2025 | 10:55 AM