ప్రధాని మోదీ, జార్జియా మెలోని ఫోటో వైరల్
ABN, Publish Date - Jun 18 , 2025 | 05:00 PM
Modi Meloni Moments: జీ7 సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీ7కు హాజరైన మోదీ, మెలోని కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 18: జీ7 సదస్సు (G7 Summit) వేదికగా భారత్ - ఇటలీ స్నేహబంధం మరోసారి సుస్పష్టమైంది. భారత్ - ఇటలీ మెలోడీ మూమెంట్ మరోసారి వైరల్‌గా మారింది. కెనడాలో జరిగిన జీ7 సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Italy PM Giorgia Meloni) దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీ7కు హాజరైన మోదీ, మెలోని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించి ఫోటోను ఇటలీ ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారత్ - ఇటలీల స్నేహబంధం ధృఢంగా పెనవేసుకుపోయాయి అని రాసుకొచ్చారు.
ఈ పోస్టుపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. మెలోని చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నానని రిప్లై ఇచ్చారు. ఈ స్నేహంతో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డికి మరో షాక్
Read Latest National News And Telugu News
Updated at - Jun 18 , 2025 | 05:01 PM