Congress: కూలిపోనున్న కాంగ్రెస్ ప్రభుత్వం..కేసీఆర్ భారీ ప్లాన్..?

ABN, Publish Date - Apr 18 , 2025 | 08:37 AM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కొంతమంది బడాబాబులు చూస్తున్నారని ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నిజంగా ఆ శాసన సభ్యుడే ఈ కామెంట్స్ చేశారా లేక పార్టీ అగ్రనేతలే చెప్పించారా అన్న అనుమానం కూడా లేకపోలేదు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కొంతమంది బడాబాబులు చూస్తున్నారని ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నిజంగా ఆ శాసన సభ్యుడే ఈ కామెంట్స్ చేశారా లేక పార్టీ అగ్రనేతలే చెప్పించారా అన్న అనుమానం కూడా లేకపోలేదు. యథాలాపంగా చేసిన వ్యాఖ్యాలా.. లేక ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎవరైనా సంప్రదించారా అన్న చర్చ కూడా సాగుతోంది.


ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యల వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న ప్రశ్న కూడా వస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగిపోవటం ఖాయమని అంటూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు తరచూ చేస్తున్న కామెంట్స్‌కు ఆ ఎమ్మెల్యే చెప్పినదానికి ఏమైనా లింక్ ఉందా. అసలు ఆ మాటల వెనుక ఉన్నా మర్మం ఏమిటి. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరనే దానిని ఈ కథనంలో తెలుసుకుందాం.


తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి ఆడిపోసుకుంటున్నారు. అధికారం కోల్పోయిన అసహనంతో తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈ సర్కార్ ఎంతోకాలం నిలవదని, కూలిపోతుందని అనేవారు. కూల్చేస్తాం, కాల్చేస్తామనేలా మాట్లాడేవారు. రేవంత్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన పనిలేదని, వారంతా వారే కూల్చుకుంటారని చెప్పేవారు. ఇదే అంశంపై బీఆర్ఎస్‌కు బీజేపీ కూడా వంతపాడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌‌‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా కాస్తా ఘాటుగానే కౌంటర్ ఇచ్చేవారు. గోతికాడ నక్కల్లా కాచుకుకూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకుంటారా..నడి బజారులో బట్టలూడదీసి కొడతారంటూ విపక్షాలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి

TDP Poll Push: టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కమిటీ

HIgh Court: Order: కరువు మండలాల స్కూళ్లలో మిడ్‌ డే మీల్స్‌పై వివరాలివ్వండి

Pawan Kalyan: వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనలోగ్రామీణాంధ్ర కీలకం

Read Latest AP News And Telugu News

Updated at - Apr 18 , 2025 | 10:52 PM