బంగారంతో పట్టుబడ్డ కన్నడ భామ

ABN, Publish Date - Mar 05 , 2025 | 03:18 PM

Kannada Actress Arrest: తరచూ బెంగళూరు వెళ్లి వస్తున్న కన్నడ నటిపై విమానాశ్రయం అధికారులు అనుమానించారు. ఆ నటిపై నిఘా పెట్టగా.. దిమ్మతిరిగే విషయాలు బయటకు వచ్చాయి.

బెంగళూరు, మార్చి 15: ఇటీవల కాలంలో డ్రగ్స్, స్మగ్లింగ్ కేసుల్లో పలువురు సినీ నటుల పేర్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే కన్నడ నటి రన్యా రావు (Kannad Actress Ranya Rao) అక్రమ బంగారం రవాణా కేసులో అరెస్ట్ అవడం సంచలనం సృష్టిస్తోంది. ఆమె దుబాయ్ నుంచి 15 కేజీల అక్రమ బంగారాన్ని తరలిస్తుండగా బెంగళూరు విమాశ్రయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రన్యా రావు తరచూ దుబాయ్ వెళ్లొస్తూ ఉండటంతో అధికారులు ఆమెపై నిఘా పెట్టారు. గత పదిహేను రోజుల్లోనే ఆమె నాలుగు సార్లు దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చినట్లు గుర్తించారు.


ఆమె దుబాయ్‌కు వెళ్లి వచ్చిన ప్రతీసారి ఒకే రంగు దుస్తులు, బెల్ట్ ధరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమె అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపర్చగా. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.


ఇవి కూడా చదవండి..

Lokesh Speech at AP Assembly: తల్లికి వందనంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన

Cyber criminals blackmail to MLA: ఏకంగా ఎమ్మెల్యేకే న్యూడ్ కాల్.. బరితెగించిన సైబర్ నేరగాళ్లు

Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 05 , 2025 | 03:41 PM