చేసిన పాపాలు పోవాలంటే ఇలా చేయండి

ABN, Publish Date - Dec 04 , 2025 | 10:09 AM

పాపానికి భయపడాల్సిన అవసరం లేదని.. పాపపు జ్ఞాపకానికే భయపడాలని గరికపాటి నరసింహారావు అన్నారు. జ్ఞాపకం ఉన్నంత కాలం పాపమైనా, పుణ్యమైనా అనుభవించక తప్పదని తెలిపారు.

భగవంతుడు సృష్టి అంతటినీ క్రీడగా భావించి ఆడుకుంటున్నాడని కొంతమంది తత్త్వవేత్తలు చెప్పారని మహా సహస్రావధాని డా.గరికపాటి నరసింహారావు (Garikapati Narsimharao) అన్నారు. నిజానికి అది ఆట అనడానికి వీలుల్లేదని, ఆడుకుంటున్నదీ ఆయనే, ఆటలో పావులుగా వినియోగింపబడుతున్నదీ ఆయనే, అసలు ఆటే ఆయనే అని చెప్పుకొచ్చారు. ద్రష్ట, దృక్కు, దృశ్యము అన్నీ ఆయనే. తత్త్వం లోతుల్లోకి వెళితే కర్త, కర్మ, క్రియ అన్నీ ఒక్కటే అని తెలిపారు. పాపానికి భయపడాల్సిన అవసరం లేదని.. పాపపు జ్ఞాపకానికే భయపడాలన్నారు.


జ్ఞాపకం ఉన్నంత కాలం పాపమైనా, పుణ్యమైనా అనుభవించక తప్పదని గరికపాటి అన్నారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే నవజీవన వేదం కార్యక్రమంలో చేసిన పాపాలు పోవాలంటే ఏం చేయాలనే దానిపై గరికపాటి నరసింహారావు ఏం చెప్పారనేది ఈ వీడియోలో వీక్షించండి.


ఈ వార్తలు కూడా చదవండి..

18 మెట్లు.. 23 ఏళ్లు.. నిరాటంకంగా కొనసాగుతున్న పూజలు

ఇంతకీ మార్గశిర పౌర్ణమి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేస్తే..

Read Latest Devotional News and Telugu News

Updated at - Dec 04 , 2025 | 10:17 AM