BCCI Warning: ఆ వ్యాపారితో జాగ్రత్త.. ఐపీఎల్ ప్లేయర్స్, యాజమాన్యాలకు బీసీసీఐ హెచ్చరిక
ABN, Publish Date - Apr 17 , 2025 | 10:34 AM
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారితో జాగ్రత్తగా ఉండాలని ఐపీఎల్ ఆటగాళ్లు, యజమాన్యాలను బీసీసీఐ హెచ్చరించింది. చట్టవ్యతిరేక పనులు చేసేలా సదరు వ్యాపారి ఒత్తిడి పెడుతున్నారని.. ఈ వ్యాపారితో సంబంధం ఉన్న వారిని అప్రమత్తం చేసింది.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారితో జాగ్రత్తగా ఉండాలని ఐపీఎల్ ఆటగాళ్లు, యజమాన్యాలను బీసీసీఐ హెచ్చరించింది. చట్టవ్యతిరేక పనులు చేసేలా సదరు వ్యాపారి ఒత్తిడి పెడుతున్నారని.. ఈ వ్యాపారితో సంబంధం ఉన్న వారిని అప్రమత్తం చేసింది. ఆ వ్యాపారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని క్రికెటర్లు, కోచ్‌లు, సహాయ సిబ్బంది, వ్యాఖ్యాతలకు బీసీసీఐ సూచించింది.
అయితే, 2013 తర్వాత ఐపీఎల్‌ను ఫిక్సింగ్ బెడద చుట్టుకుంది. ఐపీఎల్ ఆటగాళ్లు, యజమాన్యాలకు ఖరీదైన బహుమతులు, లగ్జరీ పార్టీలు ఇస్తూ ప్రముఖ వ్యాపారి మ్యాచ్ ఫిక్సింగ్‌కు తెరదీస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు గుర్తించింది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఓ లేఖ ద్వారా వెల్లడించింది. అయితే ఆ వ్యాపారి ఎవరనే విషయాన్ని బీసీసీఐ లేఖలో పేర్కొనలేదు. 2013లో ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ వార్తలు కలకలం సృష్టించాయి.
ఈ కేసులో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లుగా ఉన్న శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లు అరెస్టై జైలుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని గురు మేయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహా యజమాని రాజ్‌కుంద్రాపై కూడా వేటు పడిన విషయం చూశాం. అప్పటి నుంచి అవినీతి నిరోధక శాఖ విభాగాన్ని బీసీసీఐ మరింత పటిష్టం చేసింది. ఎక్కడైనా అనుమానం కలిగిన వెంటనే విచారణకు బీసీసీఐ ఆదేశించింది. అయితే ఇప్పుడు సాఫీగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ బెడద కొంత ఆందోళనకు గురిచేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు తెరదీస్తున్న ఆ వ్యాపారవేత్త ఎవరనే విషయంపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి
TDP Poll Push: టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కమిటీ
HIgh Court: Order: కరువు మండలాల స్కూళ్లలో మిడ్ డే మీల్స్‌పై వివరాలివ్వండి
Pawan Kalyan: వికసిత్ భారత్ లక్ష్యసాధనలోగ్రామీణాంధ్ర కీలకం
Read Latest AP News And Telugu News
Updated at - Apr 17 , 2025 | 11:15 AM