Mango Sandwich Recipe: వేసవిలో నోరూరించే సూపర్ ఫుడ్.. మ్యాంగో శాండ్‌విచ్..
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:17 PM
Summer Sandwich Ideas: శాండ్‌విచ్ అంటే చాలామందికి చెప్పలేనంత ఇష్టం. ఈజీగా చేసుకుని తినగలిగే టేస్టీ ఫుడ్ ఐటెమ్స్‌లో దీనిదే ముందు వరస. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ వేసవిలో మ్యాంగోతో శాండ్‌విచ్ ట్రై చేయండి. ఈ తియ్యటి కమ్మటి రుచి అద్భుతంగా ఉంటుంది. వేడి వాతావరణంలో కూల్ కూల్ అనుభూతినిచ్చే మామిడి శాండ్‌విచ్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసుకుని ఆస్వాదించండి.

Tasty Mango Sandwich Recipe For Summer: వేసవి కాలం రాగానే మనకు మామిడి పండ్లు పుష్కలంగా దొరుకుతాయి. మార్కెట్లో ఎక్కడ చూసినా జ్యుసీ, తియ్యటి మామిడి పండ్లు దర్శనమిస్తాయి. ఈ సీజన్లోనే లభించే మామిడి పండ్లను ఇష్టం కొద్దీ ఎక్కువగా తిన్నా సమస్యలే. అలా కాకుండా మ్యాంగోను వివిధ రూపాల్లో తీసుకుంటే కొత్త రుచితో పాటు కోరినంత తినే అవకాశం దొరుకుతుంది. మండే ఎండల్లో తియ్యటి మామిడి రుచులను ఎల్లవేళలా ఆస్వాదించాలని కోరుకుంటే మీరు మ్యాంగో శాండ్‌విచ్ తప్పక ట్రై చేయాలి. ఈ మామిడి శాండ్‌విచ్ డెజర్ట్ వేసవిలో మిమ్మల్ని చల్లగా చేసి తియ్యటి రుచులు పంచుతుంది. ఫ్రెండ్స్, బంధువులు, అతిథులు ఎవరికైనా దీన్ని వడ్డిస్తే మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. మరి, మ్యాంగో శాండ్‌విచ్ సులభంగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామా..
కావాలసిన పదార్థాలు:
మామిడి ముక్కలు - 10
క్రీమ్/గ్రీక్ పెరుగు - 1 గిన్నె
పొడి చక్కెర - టేబుల్ స్పూన్
మామిడికాయ ప్యూరీ - 1 టేబుల్ స్పూన్
ఏలకుల పొడి - 1/2 స్పూన్
మ్యాంగో శాండ్‌విచ్ తయారీ విధానం:
మామిడి శాండ్‌విచ్ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో క్రీమ్/గ్రీక్ పెరుగు, ఏలకుల పొడి, చక్కెర, మామిడి ప్యూరీ వేసి అన్నింటినీ బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లబరచడానికి ఫ్రిజ్‌లో ఉంచండి. అనంతరం బ్రెడ్ ముక్కలను తీసుకొని వాటి గోధుమ రంగు అంచులను కత్తిరించండి. ఫ్రిజ్‌లో పెట్టిన మిశ్రమం చల్లబడిన తర్వాత దాన్ని బ్రెడ్ ముక్కలకు స్పూన్ తో సమానంగా పూయండి. ప్రతి బ్రెడ్ ముక్కపై 4-5 మామిడి ముక్కలను ఉంచండి. వాటిపై ఇతర బ్రెడ్ ముక్కలు ఉంచి శాండ్‌విచ్ లు చేయండి. చివరగా ఈ శాండ్‌విచ్‌లను ఒక గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచి చల్లబర్చండి. ఒక గంట ఆగాక తియ్యటి నోరూరించే మ్యాంగో శాండ్‌విచ్‌లు తిని ఎంజాయ్ చేయండి.
Read Also: Cucumber Kanji Recipe: కీరదోసకాయ కాంజీ.. వేసవిలో చిల్లింగ్ చేసే టేస్టీ డ్రింక్
Tomato Rasam: ఒక్క సారి పెడితే.. వారం రోజులు తాగే చారు మీకు తెలుసా..
Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు