Share News

Shamshabad: విమానంలో మహిళ హల్‌చల్‌..

ABN , Publish Date - May 22 , 2025 | 08:47 AM

ఓ మహిళ విమానంలో మహిళ హల్‌చల్‌ చేసింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న ఇండిగో విమానంలో మహిళా ప్రయాణికురాలు హల్‌చల్‌ చేసింది. ఎమర్జెన్సీ డోర్‌ తీయడానికి యత్నించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Shamshabad: విమానంలో మహిళ హల్‌చల్‌..

- ఎమర్జెన్సీ డోర్‌ తీయడానికి యత్నం

- ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగింత

- ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని గుర్తింపు

శంషాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport) నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న ఇండిగో విమానం(Indigo flight)లో మహిళా ప్రయాణికురాలు హల్‌చల్‌ చేసింది. ఎమర్జెన్సీ డోర్‌ తీయడానికి యత్నించిన ఆమెను ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న ఇండిగో విమానం పార్కింగ్‌ స్థలం నుంచి టేకాఫ్‌ తీసుకోవడానికి రన్‌వే పైకి వెళ్తుండగా కర్ణాటక(Karnataka)కు చెందిన ఓ మహిళ ప్రయాణికురాలు ఎమర్జెన్సీ డోర్‌(Emergency door) తీయడానికి యత్నించింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి..


city3.2.jpg

ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. దీంతో సిబ్బందితో ఆ మహిళ వాగ్వాదానికి దిగింది. విమానాన్ని ఆపి మహిళను ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికురాలికి మతిస్థిమితం సరిగా లేదని పోలీసులు గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. చివరకు..

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి

BJP National President K Laxman: వ్యవస్థలో మార్పే అసలైన పరీక్ష

Asaduddin Owaisi: వక్ఫ్‌ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే


Kaleshwaram Pushkaralu: భక్తజన సంద్రం.. త్రివేణీ సంగమం

Read Latest Telangana News and National News

Updated Date - May 22 , 2025 | 08:47 AM