Jagdeep Dhankhar: ఐఐటీహెచ్ ఆవిష్కరణలకు కేంద్ర బిందువు కావాలి
ABN , Publish Date - Mar 03 , 2025 | 04:17 AM
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) ఆవిష్కరణలకు కేంద్ర బిందు వు కావాలని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పిలుపునిచ్చారు.

ప్రతిపల్లెకు సాంకేతికతను విస్తరించాలి
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పిలుపు
హైదరాబాద్, కంది, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) ఆవిష్కరణలకు కేంద్ర బిందు వు కావాలని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌లో జరుగుతున్న పరిశోధనలు, విద్యావిధానాలను సతీమణి సుదేశ్ ధన్‌ఖడ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ఐఐటీహెచ్ ప్రాంగణంలో మొక్కను నాటారు. అనంతరం ఐఐటీహెచ్‌లోని ఆడిటోరియంలో అధ్యాపకులు, విద్యార్థులతో సంభాషించారు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలలో కార్పొరేట్ పెట్టుబడి ఆవశ్యకతను గుర్తించామన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఆవిష్కరణలలో పురోగతి కీలకమన్నారు.
ప్రతి పల్లెకు సాంకేతికతను విస్తరించాలని సూచించారు. సామాన్యులకు ఉపయోగపడే స్టార్ట్‌పలు తీసుకురావాలన్నారు. 2008లో స్థాపించిన అనతి కాలంలోనే ప్రపంచ సవాళ్లను పరిష్కరించే దిశగా పరిఽశోధనలు జరుపుతున్నందుకు ఐఐటీహెచ్ అధ్యాపకులను ఉపరాష్ట్రపతి అభినందించారు. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకు ముందు ఉపరాష్ట్రపతి దంపతులకు శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు స్వాగతం పలికారు.