Basara Temple: బాసరలో చదువుల తల్లికి నీరాజనం
ABN , Publish Date - Feb 04 , 2025 | 05:05 AM
నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రం సోమవారం భక్తులతో కళకళలాడింది. వసంత పంచమి పర్వదినాన్ని పుర స్కరించుకొని వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

వేలాదిగా అక్షర శ్రీకార పూజలు
బాసర, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రం సోమవారం భక్తులతో కళకళలాడింది. వసంత పంచమి పర్వదినాన్ని పుర స్కరించుకొని వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అధికారులు పూజలకు రూ. వెయ్యి, రూ. 150 టికెట్‌లు ఏర్పాటు చేశారు.
అయితే రూ. వెయ్యి టికెట్ క్యూలైన్‌లు భక్తులతో కిక్కిరిసి పోగా.. రూ. 150 టికెట్ గల క్యూలైన్‌లో భక్తుల రద్దీ పలుచగా కనిపించింది. ఎక్కువ డబ్బులు చెల్లించిన భక్తులకు 5 నుంచి 8 గంటల పాటు సమయం పట్టగా.. రూ. 150 టికెట్ తీసుకున్న వారికి 2 గంటల లోపే పూజలు పూర్తవడం గమనార్హం.