Konijeti Rosaiah: క్రమశిక్షణకు మారు పేరు రోశయ్య
ABN , Publish Date - Jul 05 , 2025 | 03:52 AM
క్రమశిక్షణకు మారు పేరు.. అజాత శత్రువుగా తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న నేత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు కొనియాడారు.

మాజీ సీఎం జయంతి సభలో మంత్రులు దుద్దిళ్ల, జూపల్లి, పొన్నం
రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఖర్గే
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/ఖైరతాబాద్/రవీంద్రభారతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణకు మారు పేరు.. అజాత శత్రువుగా తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న నేత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు కొనియాడారు. నేటి యువతరం రోశయ్య రాజకీయ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ఉమ్మడి రాష్ట్రంలో 16 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రోశయ్య 92వ జయంతి సభను తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, రోశయ్య కుటుంబ సభ్యులు శివసుబ్బారావు తదితరులు నివాళులర్పించారు. అనంతరం ప్రవచన కర్త, ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావును ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
చాగంటి మాట్లాడుతూ.. రోశయ్య గవర్నర్‌గా ఉన్న సమయంలో చెన్నైలో ప్రవచనాలు చెప్పేందుకు వెళ్లినప్పుడు రాజ్‌భవన్ నుంచి బయటొకొచ్చి మరీ ఆయన స్వాగతం పలికారని గుర్తు చేసుకున్నారు. మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి మాట్లాడుతూ.. రోశయ్య ఎప్పుడూ అందరికీ ఆదర్శ నాయకత్వాన్ని అందించే లక్ష్యంతో పనిచేశారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఆదర్శ రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. 16 ఏళ్లు అప్పులు చేయకుండా ఉన్న దాంట్లో నిధులు సర్దుబాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన గొప్ప నేత రోశయ్య అని అన్నారు. ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి నిర్వహించడం అభినందనీయమని.. ఆయన వాగ్ధాటి, ఛలోక్తులను ఎవరూ మర్చిపోరని చెప్పారు. రోశయ్య ఆలోచనలు, ఆయన దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలను పార్టీలకతీతంగా ఇప్పుడు అనుసరించాల్సిన అవసరముందని గుత్తా అన్నారు. ఇటు డీజీపీ కార్యాలయంలోనూ రోశయ్య జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి అదనపు డీజీపీ మహేశ్ భగవత్ పూలమాల వేసి నివాళులర్పించారు.
రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఖర్గే
మాజీ సీఎం రోశయ్య కాంస్య విగ్రహం హైదరాబాద్‌లో ఆవిష్కృతమైంది. లక్డీకాపూల్‌లోని సైఫాబాద్ పోలీ్‌సస్టేషన్ ప్రాంగణంలో 450 కిలోల బరువుతో ఏర్పాటు చేసిన రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన జయంతి సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, దయానంద్, సీనియర్ నేతలు వి.హన్మంతరావు, కేవీపీ రామచంద్రరావు, టీజీ వెంకటేశ్, ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, రోశయ్య కుటుంబ సభ్యులు శివసుబ్బారావు, మూర్తి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి