Konda Murali: ఇరువర్గాల వాదనలు విన్నాకే నిర్ణయం
ABN , Publish Date - Jun 27 , 2025 | 05:09 AM
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి వ్యాఖ్యలతో రేగిన వివాదంలో ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ నిర్ణయించింది.

కొండా మురళి వివాదంపై రేపు మళ్లీ క్రమశిక్షణ కమిటీ భేటీ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి వ్యాఖ్యలతో రేగిన వివాదంలో ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ నిర్ణయించింది. గాంధీభవన్‌లో కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన భేటీలో సభ్యులు శ్యామ్ మోహన్, కమలాకర్‌రావు, నాగార్జున రెడ్డి, జాఫర్ జావెద్, రామకృష్ణలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొండా మురళి వ్యాఖ్యల వివాదం, ఆసిఫాబాద్‌లో పార్టీ నేత రాగి శ్రీనివా్‌సపై వచ్చిన ఫిర్యాదులు, ఖైరతాబాద్ కాంగ్రెస్ నేతల మధ్య వివాదం, మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌రావుపై వచ్చిన ఫిర్యాదులపై ప్రాథమికంగా చర్చించారు. ఆయా వివాదాలకు సంబంధించి ఇరు వర్గాల వాదనలు వినాలన్న నిర్ణయానికి కమిటీ వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వివాదంపై క్రమశిక్షణ కమిటీ శనివారం మరోమారు భేటీ కానుందని మల్లు రవి వెల్లడించారు.