Share News

TG Govt Jobs: నిరుద్యోగులకు మరో సువర్ణావకాశం.. ఆరోగ్యశాఖ నుంచి మెగా నోటిఫికేషన్

ABN , Publish Date - Jun 28 , 2025 | 01:37 PM

MHSRB Telangana recruitment 2025: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం కోసం వేచి చూసే నిరుద్యోగులకు మరో ఛాన్స్. తాజాగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 607 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు..

TG Govt Jobs: నిరుద్యోగులకు మరో సువర్ణావకాశం.. ఆరోగ్యశాఖ నుంచి మెగా నోటిఫికేషన్
MHSRB Telangana recruitment 2025

Telangana Medical Recruitment 2025: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 607 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్టు ఇచ్చినట్టు తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టీజీఎంహెచ్‌ఎఆర్బీ) సెక్రటరీ గోపీకాంత్‌రెడ్డి తెలిపారు. మల్టీ జోనల్1 లో 379 పోస్టులు, మల్టీ జోనల్2 లో 228పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ జరగనుంది. జూలై 10వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ చాన్నాళ్ల తర్వాత భారీ ఉద్యోగ నోటిఫఇకేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను ఈ నియామకం కింద భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే వారి వయసు 46 ఏళ్ల లోపు ఉండాలి. సంబంధిత విభాగంలో అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై 10వ తేదీ నుంచి ఆరంభమవుతుంది. జూలై 17 సాయంత్రం 5 గంటలలోపు అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ - https://mhsrb.telangana.gov.in లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారని గుర్తుంచుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.500 లు కాగా ప్రాసెసింగ్ ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. జూలై 18-జూలై 19 వరకూ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ద్వారా వివరాలు సరిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెల జీతం రూ.68,900-రూ.2,05,500 మధ్య ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి

2050లో హైదరాబాద్‌ ఎలా ఉండబోతోంది?

బీఆర్‌ఎస్ ధర్నా.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 28 , 2025 | 03:31 PM