దుబాయి నుంచి స్వదేశానికి తీసుకెళ్లండి
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:21 AM
బతుకుదెరువు కోసం వారు దుబాయి వెళ్లారు. తిరిగి ఇంటికి రాలేక ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమను స్వదేశానికి తీసుకురావాలని వారు వేడుకుంటున్నారు.

సీఎం రేవంత్‌కు తెలంగాణ వాసుల వేడుకోలు
హన్వాడ, హుస్నాబాద్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): బతుకుదెరువు కోసం వారు దుబాయి వెళ్లారు. తిరిగి ఇంటికి రాలేక ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమను స్వదేశానికి తీసుకురావాలని వారు వేడుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదర్పలి గ్రామానికి చెందిన మ్యాతరి గోపాల్.. దుబాయికి వెళ్లి ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. గతేడాది సెప్టెంబరులో స్వదేశానికి వచ్చేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లగా అక్కడి పోలీసులు ట్రావెల్ బాండ్ కేసు నమోదు చేశారు. జరిమానా విధించగా డబ్బుల చెల్లించలేకపోవడంతో మూడు నెలల జైలు శిక్ష విధించారు. తన ఐడీపై ఎవరో సిమ్ కార్డు తీసుకొని చట్టవిరుద్ధమైన కాల్స్ చేసినందుకు జరిమానావిధించినట్లు తెలిపారు.
జైలు నుంచి బయటకు వచ్చినా పాస్‌పోర్టు హోల్డ్‌లో ఉందని, తన పరిస్థితి దారుణంగా ఉందని గోపాల్ ఓ వీడియో ద్వారా కుటుంబీకులకు చెప్పాడు. సీఎం రేవంత్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి చొరవ తీసుకొని తనను స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నాడు. కాగా ‘ఏజెంట్ చేసిన మోసానికి దుబాయిలో కష్టాలు పడుతున్నా. ఆరోగ్యం క్షీణించింది. కాళ్లవాపులతో నడవలేకపోతున్నా.. కంపెనీ వారు పాస్‌పోర్టు తీసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం స్పందించి నన్ను స్వదేశానికి తీసుకెళ్లండి’ అంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన చొప్పరి లింగయ్య వేడుకున్నాడు. ఈ మేరకు ఆయన పంపిన సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. తన భర్తను ఇంటికి రప్పించాలని లింగయ్య భార్య మంత్రి పొన్నంను కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఫోర్త్ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి
Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!
Read Latest Telangana News And Telugu News