Power Demand: భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:28 AM
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పరుగులు పెడుతోంది. ఈ నెల 7న 15,920 మెగావాట్లుగా డిమాండ్ రికార్డయింది. దాంతో రూఫ్‌టాప్ సోలార్‌తో కలుపుకొని ఇది 16 వేల మెగావాట్లు దాటిందని అధికారులు చెబుతున్నారు.

ఈ నెల 7న 15,920 మెగావాట్లు
10 రోజులుగా 15 వేల మెగావాట్లు
నేడు డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పరుగులు పెడుతోంది. ఈ నెల 7న 15,920 మెగావాట్లుగా డిమాండ్ రికార్డయింది. దాంతో రూఫ్‌టాప్ సోలార్‌తో కలుపుకొని ఇది 16 వేల మెగావాట్లు దాటిందని అధికారులు చెబుతున్నారు. ఇక సోమవారం సాయంత్రం 4.32 గంటల సమయంలో రాష్ట్ర డిమాండ్ 15,804 మెగావాట్లుగా నమోదయింది. గతేడాది ఇదే సమయానికి 14,398 మెగావాట్లు మాత్రమే కావడం గమనార్హం.
రోజురోజుకు డిమాండ్ అమాంతం పెరుగుతుండటంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. విద్యుత్ సరఫరా పరిస్థితిపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్‌ను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు
Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
For Telangana News And Telugu News