Telangana High Court: నెక్కొండ మున్సిపాలిటీకి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..
ABN , Publish Date - Nov 25 , 2025 | 09:17 PM
తెలంగాణ రాష్ట్రంలో మరో మున్సిపాలిటీ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంలో నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలంటూ..
తెలంగాణ రాష్ట్రంలో మరో మున్సిపాలిటీ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంలో నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలంటూ నెక్కొండ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమున రెడ్డి, పత్తిపాక గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ లావుడ్యా సరిత.. లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
నెక్కొండ మేజర్ గ్రామపంచాయతిని (Nekkonda Major Gram Panchayat) నెక్కొండ, అమీన్ పేట, గుండ్రపల్లి, పత్తిపాక, నెక్కొండ తండా, టీ.కె తండా గ్రామ పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా నెక్కొండకు మున్సిపాలిటీగా (Municipality) అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. నోటిఫికేషన్‌కు ముందే నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది.
వరంగల్ జిల్లాలో ప్రస్తుతం మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. వర్ధన్నపేట, నర్సంపేట, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండగా.. నెక్కొండ మున్సిపాలిటీగా మారితే మొత్తం నాలుగు అవనున్నాయి. నెక్కొండను మున్సిపాలిటీగా చేస్తే.. ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుందని స్థానికులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!
లిక్కర్ స్కామ్‌లో.. జోగి రమేష్‌కు పోలీస్ కస్టడీ..
మరిన్న తెలంగాణ, ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..