బండరాయితో కొడుకు తలపై కొట్టిన మహిళ.. బాలుడికి తీవ్రగాయాలు..
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:25 PM
కన్నప్రేమను మర్చిపోయి..మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది ఓ మహిళ. అకారణంగా కొడుకు తలపై బండరాయితో దారుణంగా కొట్టి హింసించింది. తీవ్రగాయాలైన బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సంగారెడ్డి జిల్లా, వట్‌పల్లి: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కన్నప్రేమను మరచిన తల్లి కొడుకు పట్ల అమానుషంగా ప్రవర్తించింది. మాతృత్వాన్నే మర్చిపోయి దారుణంగా హింసించింది. అకారణంగా 15 ఏళ్ల కుమారుడి తలపై బండరాయితో దాడి చేసింది. తల్లి తీవ్రంగా కొట్టడంతో గాయాలపాలైన బాలుడు ప్రస్తుతం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి ఫిర్యాదు మేరకు వట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చెప్పిన పని చేయలేదనే కోపంతో రాజు (15) తలపై అతడి తల్లి అనురాధ బండ రాయితో తీవ్రంగా కొట్టింది. రక్తమోడుతున్న గాయాలతోనే బాలుడు వట్‌పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అకారణంగా తల్లి తరచూ తనను కొడుతోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే, మరో వ్యక్తితో తన తల్లి అనురాధ వివాహేతర సంబంధాన్ని పెట్టుకుందని.. తండ్రిని, తననూ చిత్రహింసలు పెడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాలుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
బాలుడి ఫిర్యాదు మేరకు అతడి తల్లి అనురాధపై వట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా, ప్రస్తుతం రాజు పదోతరగతి చదువుతున్నాడు.
Also Read:
ఆ పీఠాన్ని టార్గెట్ చేసుకున్న బీఆర్ఎస్.. అసలు ప్లాన్ ఇదేనా..?
మరో కొరియోగ్రాఫర్ పై పోక్సో కేసు.. ఆలస్యంగా వెలుగులోకి..
For More Telangana News and Telugu News..