Share News

Hyderabad: ఓసీలు అంతా కలిసి మాపై దాడికి కుట్ర

ABN , Publish Date - Jul 15 , 2025 | 06:04 AM

ఎగువ కులాల వాళ్లంతా ఏకమై మాపై(బీసీలపై) దాడి చేయాలని చూస్తున్నారు’’ అని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ఆరోపించారు.

Hyderabad: ఓసీలు అంతా కలిసి మాపై దాడికి కుట్ర

  • బీసీలంతా ఒకవైపు.. కల్వకుంట్ల కుటుంబం ఒకవైపు

  • కాంగ్రె్‌సతో కవిత మిలాఖత్‌.. త్వరలోనే ఆమె ఆ పార్టీలో చేరతారు: తీన్మార్‌ మల్లన్న

హైదరాబాద్‌, పీర్జాదిగూడ, పంజాగుట్ట, జూలై 14(ఆంధ్రజ్యోతి): ‘‘ఎగువ కులాల వాళ్లంతా ఏకమై మాపై(బీసీలపై) దాడి చేయాలని చూస్తున్నారు’’ అని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ఆరోపించారు. గతంలో పరకాల, బైరాన్‌పల్లిలో బీసీ మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన జాతి వాళ్లదని విమర్శించారు. ‘‘బీసీలమంతా కలిసి రాజకీయ పార్టీగా ముందుకొస్తాం. రాష్ట్రంలో అధికారాన్ని చేపడతాం’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పీర్జాదిగూడలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని బీసీలంతా ఒకవైపు.. కల్వకుంట్ల కుటుంబం ఒకవైపు అని చెప్పారు. తన మీద వారి మనుషులను ఉసిగొల్పడం ద్వారా కవిత హత్యాయత్నం చేశారని.. ఆమెపై డీజీపీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. తన మీద, తన కార్యాలయం మీద దాడి చేసింది సుజిత్‌ రావు కల్వకుంట్ల కవిత బంధువే నని పేర్కొన్నారు. ఎథిక్స్‌ కమిటీ దృష్టికి కవిత వ్యవహారం తీసుకెళ్లి ఆమె సభ్యత్వం రద్దు చేయాలని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశాం’’ అని చెప్పారు. తనపై తెలంగాణ జాగృతి జరిపిన దాడిని బీఆర్‌ఎస్‌ నేతలు కూడా స్వాగతించలేదని, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌, మంత్రి పొన్నం, ఇతర కాంగ్రెస్‌ పెద్దలు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ కవితకు అండగా నిలిచారని విమర్శించారు.


కాంగ్రెస్‌ పార్టీకి కవితకు అనధికారిక ఒప్పందం నడుస్తోందని ఆరోపించారు., ఇటీవల ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగినప్పుడే కవిత కూడా మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉండిందని.. ఇది నిజమో, కాదో అనేది కాంగ్రెస్‌ పెద్దలే సమాధానం చెప్పాలన్నారు. కవిత కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని చెప్పారు.. మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారని, ఆ ఒప్పందంతోనే తన మీద మూడుసార్లు హత్యాప్రయత్నం జరిగిందని.. అందుకే ఆయనపైనా ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. న్యాయం జరగకపోతే రాష్ట్రంలోని రెండు కోట్ల మంది బీసీలను రోడ్లపైకి తీసుకొచ్చి నిరసన తెలుపుతానని హెచ్చరించారు. కాగా తీన్మార్‌ మల్లన్నకు వై ప్లస్‌ కేటగిరి భద్రత కల్పించాలని మున్నూరు కాపు సంఘాల ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. ఆయనపై జాగృతి నేతలు జరిపిన దాడిని ఖండిస్తున్నట్లు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. బీసీల సంరక్షణకు చట్టం తేవాలని బీసీ జేఏసీ అధ్యక్షుడు సంగెం సూర్యారావు డిమాండ్‌ చేశారు.


గన్‌మెన్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌!

హైదరాబాద్‌ సిటీ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): క్యూ న్యూస్‌ ఆఫీ్‌సపై దాడి ఘటనలో గాల్లోకి కాల్పులు జరిపిన తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌ కుమార్‌ గన్‌మెన్‌ శ్రీనివా్‌సపై రాచకొండ సీపీ శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. గన్‌మెన్‌ను తొలగించి కార్‌ హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేసినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '

తిరుపతి రైల్వే‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 15 , 2025 | 06:04 AM