Share News

Illegal Sand: ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ABN , Publish Date - Feb 20 , 2025 | 04:07 AM

ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను విక్రయిస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి రూ. 1.20లక్షల విలువైన 60 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.

Illegal Sand: ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

  • రూ. 1.20 కోట్ల విలువైన 60 టన్నుల ఇసుక స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను విక్రయిస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి రూ. 1.20లక్షల విలువైన 60 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి మండలం పరిఽధిలో కొంతమంది ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు నాంపల్లి మండల రెవెన్యూ అధికారులతో కలిసి సౌత్‌వెస్టు టాస్క్‌ఫోర్స్‌ పోలీసు బృందం రంగంలోకి దిగింది.


ధూల్‌పేటకు చెందిన సంతోష్‌ సింగ్‌ అనే వ్యక్తి పురానాపూల్‌లో ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించి ఆ ప్రాంగణంపై ఆకస్మికంగా దాడి చేశారు. ఎలాంటి వే బిల్లులు, రెవెన్యూ మైనింగ్‌ అధికారుల అనుమతి లేకుండా అతను అక్రమంగా ఇసుకను అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ అక్రమంగా డంప్‌ చేసిన రూ. 1.20లక్షల విలువైన 60 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Feb 20 , 2025 | 04:07 AM