Smita Sabharwal: ‘కర్మణ్యే వాధికారస్తే.. మా ఫలేషు కదాచన’
ABN , Publish Date - Apr 30 , 2025 | 03:59 AM
పర్యాటక శాఖ కార్యదర్శి నుంచి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఇటీవల బదిలీ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ ఎక్స్‌లో ఆస్తకికర పోస్టు చేశారు.

బదిలీ నేపథ్యంలో భగవద్గీత శ్లోకం పోస్టు చేసిన స్మిత సబర్వాల్
పర్యాటక శాఖ పని శైలిని పూర్తిగా మార్చి జవాబుదారీతనాన్ని పెంచా
అంతర్జాతీయ ఈవెంట్ కోసం ప్రణాళికలు రచించా: స్మిత
హైదరాబాద్, ఏప్రిల్29 (ఆంధ్రజ్యోతి): పర్యాటక శాఖ కార్యదర్శి నుంచి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఇటీవల బదిలీ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ ఎక్స్‌లో ఆస్తకికర పోస్టు చేశారు. హైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్-2025 ఏర్పాట్లలో పర్యాటక శాఖ కార్యదర్శిగా స్మిత కీలకంగా వ్యవహరిస్తున్న వేళ ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో భగవద్గీతలోని ‘కర్మణ్యే వాధికారస్తే... మా ఫలేషు కదాచన’ అనే శ్లోకంతో ఆమె తన పోస్టును ప్రారంభించడం చర్చనీయాంశమైంది. పర్యాటక శాఖలో నాలుగు నెలలు ఉన్నానని, శాయశక్తులా పని చేశానని స్మిత పేర్కొన్నారు. ‘‘దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పర్యాటక పాలసీ 2025-30ని తొలిసారిగా అమలులోకి తెచ్చాను.
నిర్లక్ష్యానికి గురైన టూరిజం సర్క్యూట్‌ల్లో పెట్టుబడులు రావడానికి అది దిశానిర్దేశం చేయనుంది. పర్యాటక శాఖ పని శైలిని పూర్తిగా మార్చి జవాబుదారీతనాన్ని పెంచా. ఎన్నో అవకాశాలకు తలుపులు తెరిచే అంతర్జాతీయ ఈవెంట్ నిర్వహణకు అవసరమైన లాజిస్టిక్స్, ప్రణాళికలకు పునాది వేశా. తెలంగాణ పర్యాటక శాఖతో పని చేయడం ఆనందంగా, గౌరవంగా ఉంది’’ అని స్మిత తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై కృతిమ మేధ సాయంతో రూపొందించిన ఓ ఫొటోను ఆమె ఎక్స్‌లో ఇటీవల రీపోస్ట్ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ పోస్టు అంశంలో గచ్చిబౌలి పోలీసులు స్మిత సబర్వాల్‌కు నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తనలాగే 2000 మంది పోస్టులు పెట్టారని, వారందరిపైనా ఇలాంటి చర్యలే ఉంటాయా? అని ‘ఎక్స్’లో ఆమె ప్రశ్నించారు.ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె బదిలీ అయ్యారు.
ఇవి కూడా చదవండి
TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన
Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ
Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్
For Telangana News And Telugu News