Shamshabad Airport: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల్లో శంషాబాద్‌కు 4వ స్థానం
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:48 AM
ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 4వ స్థానం

ఏడాదిలో 25.6% వృద్ధి
శంషాబాద్ రూరల్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 4వ స్థానం దక్కిందని జీఎంఆర్ ఎయిర్‌పోర్టు అధికారులు శనివారం ఒక ప్రకటలో తెపారు. 2024 మే నుంచి 2025 మే వరకు ఎయిర్‌పోర్టు 25.6 శాతం వృద్ధి సాధించిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి, గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు, విమానయాన సంస్థల భాగస్వామ్యం పెరుగుదల, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం వంటి అంశాల ద్వారా గణనీయంగా వృద్ధి సాధిస్తోందని వెల్లడించారు.