Telangana Police: రాష్ట్రంలో భారీగా ఐపీఎ్‌సల కొరత..!
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:53 AM
తెలంగా ణ రాష్ట్ర పోలీసు శాఖను ఐపీఎ్‌సల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలు, కమిషనరేట్ల సంఖ్య పెరిగినా.. పెరుగుతున్న నేరాలకు అనుగుణంగా.. వాటి కట్టడికి కొత్త విభాగాలు ఏర్పాటవుతున్నా..

చివరిసారి 2016లో క్యాడర్ రివ్యూ
ప్రస్తుతం ఉన్నది 139 పోస్టులు
సీనియర్లకు రెండు/మూడు బాధ్యతలు
29 పోస్టుల మంజూరుకు రాష్ట్రం విజ్ఞప్తి
ఇటీవల ప్రధాని మోదీని కోరిన రేవంత్
నేర దర్యాప్తులో సీఐడీ పాత్ర కీలకం..! సైబర్ నేరాలు పెరుగుతుండడంతో.. కొత్తగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటైంది..! మహిళా భద్రతకు ప్రత్యేక విభాగం..! నిజానికి ఈ మూడింటికీ.. డీజీ లేదా అదనపు డీజీ స్థాయి అధికారులు నేతృత్వం వహించాలి. కానీ, తెలంగాణలో ఈ మూడు విభాగాలకు డీజీ స్థాయి అధికారి శికాగోయల్ నేతృత్వం వహిస్తున్నారు.
33 జిల్లాల్లో 9 కమిషనరేట్లున్నాయి. 20 జిల్లాలు ఎస్పీల నేతృత్వంలో కొనసాగుతున్నాయి. అయి తే.. చాలా చోట్ల ఐపీఎ్‌సల కొరత తీవ్రంగా ఉంది.
హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): తెలంగా ణ రాష్ట్ర పోలీసు శాఖను ఐపీఎ్‌సల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలు, కమిషనరేట్ల సంఖ్య పెరిగినా.. పెరుగుతున్న నేరాలకు అనుగుణంగా.. వాటి కట్టడికి కొత్త విభాగాలు ఏర్పాటవుతున్నా.. హైడ్రా వంటి విభాగాలకు ఐపీఎ్‌సల అవసరం ఉన్నా.. ఐపీఎ్‌సల క్యాడర్‌ను పెంచకపోవడంతో సీనియర్లపై అదనపు భారం పడుతోంది. ఒక్కొక్కరు ద్వి/త్రిపాత్రాభినయాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
క్యాడర్ రివ్యూ లేక..
రాష్ట్రాలకు సంబంధించి ప్రతి ఐదేళ్లకోసారి కేంద్ర హోంశాఖ ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేయాల్సి ఉంటుం ది. తెలంగాణలో చివరిసారి 2016లో క్యాడర్‌పై సమీక్ష జరిగింది. దాంతో.. ఐపీఎస్ పోస్టుల సంఖ్య 139కి పెరిగింది. అదే సంవత్సరం అక్టోబరులో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. 10 ఉమ్మడి జిల్లాలు 29గా.. ఆ తర్వాత 31గా.. ఆపైన 33గా మారాయి. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ కమిషనరేట్లుండగా.. సైబరాబాద్ నుంచి హైదరాబాద్ తూర్పున ఉన్న రాచకొండను విడదీశారు. జనాభా, విస్తీర్ణం, నే రాల రేటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. నిజామాబాద్, రామగుండం, కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం కమిషనరేట్లను ఏర్పాటు చేశారు. మిగతా 20 జిల్లాలకు ఎస్పీ స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తొలినాళ్లలో ఐపీఎ్‌సల కొరత కారణంగా.. నాన్-క్యాడర్ ఎస్పీలు, కొన్నిచోట్ల నాన్-క్యాడర్ అదనపు ఎస్పీలకు కొన్నిచోట్ల బాధ్యతలను అప్పగించారు. కమిషనరేట్లకు డీఐజీ నుంచి డీజీ స్థాయి అధికారులు కమిషనర్లుగా ఉంటారు. వారి కింద శాంతిభద్రతలు, ట్రాఫిక్, నేరాలు, స్పెషల్‌బ్రాంచ్.. ఇలా పలు విభాగాలకు ఐపీఎ్‌సలే నేతృత్వం వహించాలి. రాష్ట్రంలో ఐపీఎ్‌సల కొరతతో చాలాచోట్ల పోస్టులు ఖాళీగా ఉన్నా యి. మరికొన్ని చోట్ల ఉన్న ఐపీఎ్‌సలకే అదనపు బాధ్యతలు అప్పగించారు. నిజానికి 2021లో కేంద్ర హోంశాఖ ఐపీఎస్ క్యాడర్‌ను సమీక్షించి, పోస్టులను పెంచాల్సి ఉండగా.. కొవిడ్ కల్లోలం ఇతరత్రా కారణాలతో ఆ ప్రక్రియ వాయిదా పడింది. 2021 నుంచే తెలంగాణ సర్కారు కేంద్రానికి మొరపెట్టుకుంటు న్నా.. క్యాడర్ రివ్యూ దిశలో అడుగు ముందుకు పడలేదు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం గత ఏడాది జనవరి 4, జూలై 4, అక్టోబరు 7 తేదీల్లో కేంద్రానికి ఈ మేర కు లేఖలు రాయగా.. హోంమంత్రిత్వ శాఖ మార్చి 31, ఆగస్టు 13, నవంబరు 27 తేదీల్లో ప్రత్యుత్తరాలి స్తూ.. రివ్యూ నిర్వహిస్తామని పేర్కొంది. గత ఏడాది డిసెంబరు 16న ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభలో ఇదే అంశంపై అడిగిన ప్రశ్నకు.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ.. ఈ విషయం తమ దృష్టిలో ఉం దని, క్యాడర్ రివ్యూ చెప్పారు. ఇది జరిగి రెండు నెలలు గడిచినా.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలి ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి.. 29 అదనపు ఐపీఎస్ పోస్టుల మంజూరుకు విజ్ఞప్తి చేశారు.
కొరత.. డిప్యూటేషన్లు
నిజానికి తెలంగాణలో ప్రస్తుతం 139 ఐపీఎస్ పోస్టులున్నా.. రెండు ఖాళీగా ఉన్నాయి. మిగతా 137 మందిలో తొమ్మిది మంది కేంద్ర డిప్యూటేషన్‌పై సర్వీసుల్లో ఉన్నారు. మిగతావారిలో ఎ.వి.రంగనాథ్, వి.బి.కమలాసన్‌రెడ్డి వంటి వారు 10 మంది నాన్-పోలీసింగ్ విభాగాల్లో పనిచేస్తున్నారు. అక్కడా కమలాసన్‌రెడ్డి లాంటి వారు డ్రగ్ కంట్రోల్ డీజీగా.. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డీజీపీ జితేందర్‌తోపాటు.. సీనియర్ ఐపీఎ్‌సలు కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి, వి.బి.కమలాసన్‌రెడ్డి, వి.సత్యనారాయణ, మరో ఇద్దరు అధికారులు ఈ ఏడాది పదవీవిరమణ పొందనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో, నార్కోటిక్స్ బ్యూరో వంటి విభాగాల్లో ఐపీఎ్‌సల కొర త ఉంది. డీఐజీ, ఐజీ, అదనపు డీజీ, డీజీపీ స్థాయి పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. దాంతో.. కొన్ని కమిషనరేట్లలో నాన్-క్యాడర్ ఎస్పీలు ఏకంగా డీఐజీ స్థాయి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో ట్రా ఫిక్, శాంతిభద్రతలు, నేరాలు, స్పెషల్ బ్రాంచ్‌లలో పూర్తిస్థాయిలో అధికారులు అందుబాటులో లేరు. ఉన్న ఐపీఎ్‌సలు రెండు, అంతకంటే ఎక్కువ పో స్టుల బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తోంది. షికాగోయల్ ఏకంగా మూడు విభాగాలకు చీఫ్‌గా ఉన్నారు.
ఇవి కూడా చదవండి
BRS:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు పరిశీలన..
TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
AICC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా అంటే..
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here