Share News

Satyavathi Rathod: ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే

ABN , Publish Date - Jul 10 , 2025 | 04:56 AM

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అంటే మీకే కాదు.. మాకు కూడా ఎంతో గౌరవం’ అని మంత్రి సీతక్కను ఉద్దేశించి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

Satyavathi Rathod: ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ అంటే మాకూ గౌరవమే

  • మంత్రి సీతక్క వ్యాఖ్యల అర్థమేమిటి?

  • మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత సత్యవతి రాథోడ్‌

  • దాడి చేస్తే బీఆర్‌ఎస్‌ను భూస్థాపితం చేస్తాం

  • ఎండీ రాధాకృష్ణ ‘కొత్త పలుకు’ అక్షర సత్యం

  • టీపీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు రవికుమార్‌

మహబూబాబాద్‌, బర్కత్‌పుర, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణ అంటే మీకే కాదు.. మాకు కూడా ఎంతో గౌరవం’ అని మంత్రి సీతక్కను ఉద్దేశించి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహబూబాబాద్‌లో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ‘ఆంధ్రజ్యోతి’ని టచ్‌ చేసి చూడు అంటూ మంత్రి సీతక్క వ్యాఖ్యలు చేయడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక అన్నా.. ఎండీ రాధాకృష్ణ అన్నా మాకు ఎనలేని గౌరవమని చెప్పారు. ‘ఆంధ్రజ్యోతి’పై దాడి చేస్తే బీఆర్‌ఎస్‌ పార్టీని భూస్థాపితం చేస్తామని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జిలుకర రవికుమార్‌ హెచ్చరించారు.


హైదరాబాద్‌లో ఆయన బుధవారం మాట్లాడుతూ ఎండీ రాధాకృష్ణ ‘కొత్త పలుకు’లో రాసిన ‘తెలంగాణ బీఆర్‌ఎస్‌ జాగీరా?’ కథనం అక్షర సత్యమని, దీన్ని జీర్ణించుకోలేని బీఆర్‌ఎస్‌ పార్టీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిపై దాడులకు కుట్ర చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. దాడులకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అధికారం కోల్పోయిన తర్వాత దుర్మార్గంగా వ్యవహరించడం బీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన భూమిక పోషించిందని, దీనిని బీఆర్‌ఎస్‌ విస్మరించడం శోచనీయమన్నారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 04:56 AM