RGUKT: ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల
ABN , Publish Date - Jul 05 , 2025 | 05:44 AM
2025-26 విద్యాసంవత్సరానికి బాసర, మహబూబ్‌నగర్ ఆర్జీయూకేటీలో ఎంపికైన విద్యార్థుల జాబితాను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ గోవర ్ధన్, ఏవో మురళీధరన్ శుక్రవారం బాసరలో విడుదల చేశారు.

ప్రవేశాల్లో సత్తా చాటిన బాలికలు
ఈ నెల 7, 8, 9 తేదీల్లో కౌన్సెలింగ్
బాసర, జూలై 4 (ఆంధ్రజ్యోతి): 2025-26 విద్యాసంవత్సరానికి బాసర, మహబూబ్‌నగర్ ఆర్జీయూకేటీలో ఎంపికైన విద్యార్థుల జాబితాను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ గోవర ్ధన్, ఏవో మురళీధరన్ శుక్రవారం బాసరలో విడుదల చేశారు. ప్రవేశాల్లో ఏకంగా 72శాతం బాలికలు ఎంపికై సత్తా చాటారు. అలాగే ఎంపికైన వారిలో 88శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు చెందినవారే. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో 20, 258 దరఖాస్తులు రాగా.. రెండు క్యాంప్‌సలో కలిపి మొత్తం 1690 సీట్లకు సంబంధించిన జాబితాను ప్రకటించారు.
ఈ వివరాలన్నింటినీ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అధికారులు అందుబాటులో ఉంచామని వీసీ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 7, 8, 9తేదీల్లో బాసర క్యాంప్‌సలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నుంచి 297 మంది విద్యార్థులు.. అత్యల్పంగా జయశంకర్ జిల్లా నుంచి ఒక్కరు ఎంపికైనట్టు అధికారులు చెప్పారు. ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్ క్యాంపస్ కోసం తాత్కాలిక భవనాలను సిద్ధం చేశామని, వచ్చే నెల 4నుంచి తరగతులు ప్రారంభిస్తామని వీసీ తెలిపారు.