Suryapet: రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:06 AM
రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్’ అంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేస్తున్న ఫెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

సూర్యాపేటలో కేసీఆర్, కేటీఆర్, జగదీశ్ రెడ్డి ఫొటోలతో బీఆర్‌ఎస్వీ ఫ్లెక్సీ
సూర్యాపేట(కలెక్టరేట్), జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ‘రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్’ అంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేస్తున్న ఫెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. శనివారం సంగారెడ్డి జిల్లా జిన్నారంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్న ధర్నాలో ఓ సినిమాలోని రప్పా.. రప్పా.. అనే డైలాగుతో ఫ్లెక్సీ ఒకటి దర్శనమివ్వగా.. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనూ ఫ్లెక్సీ వెలిసింది. స్థానిక రైతుబజార్ వద్ద మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డిల ఫొటోలతో స్థానిక బీఆర్‌ఎస్వీ నాయకులు ఈ ఫెక్సీని ఏర్పాటు చేశారు.
‘రప్పా.. రప్పా.. 3.0లోడింగ్.. ఫ్రం సూర్యాపేట.. స్థానిక సంస్థల ఎన్నికలతో మొదలు 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు సూర్యాపేట నుంచి శ్రీకారం చుట్టడానికి జగదీశన్న సారథ్యంలో మేం రెడీ’ అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. కాగా, కేసీఆర్ మరో ఉద్యమం చేస్తే తప్ప తెలంగాణ జలదోపిడీని ఆపలేమని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన కేసీఆర్‌ను జైల్లో పెట్టడం ఎవరితరం కాదన్నారు.