Share News

Minor Blackmail Case: ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్.. అక్కను ప్రేమించాడు.. చెల్లెలు కావాలన్నాడు

ABN , Publish Date - May 16 , 2025 | 12:21 PM

Minor Blackmail Case: ఘట్‌కేసర్‌లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో మైనర్‌ను ఓ యువకుడు ట్రాప్ చేశాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔషాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Minor Blackmail Case: ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్..  అక్కను ప్రేమించాడు.. చెల్లెలు కావాలన్నాడు
Minor Blackmail Case

మేడ్చల్, మే 16: ప్రేమ పేరుతో చాలా మంది ఆడపిల్లలు మోసపోతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమకు దారి తీస్తున్నాయి. కానీ ఆ ప్రేమ ఎంతో కాలం నిలబడని పరిస్థితి. ప్రేమిస్తున్నానంటూ యువతులను మోసం చేస్తున్నారు. అంతేకాకుండా వారితో అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌ మెయిల్‌కు కూడా పాల్పడుతున్నారు. ఈ ఊబిలో నుంచి బయటపడే మార్గం లేక కొందరు యువతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఘట్‌కేసర్‌లో (Ghatkesar) ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మైనర్‌ను ట్రాప్ చేసిన ఓ యువకుడు.. ఆమెను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి భారీగా బంగారం వసూలు చేశాడు. ఇంతటితో ఆగకుండా అతడు చేసిన మరో పనితో ఆ మైనర్ బలవన్మరణానికి యత్నించింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


ఘట్‌కేసర్‌లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో మైనర్‌ను ఓ యువకుడు ట్రాప్ చేశాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔషాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అవినాష్ రెడ్డి అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మైనర్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో ఇద్దరు కలుసుకుని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ తరువాత అవినాష్ రెడ్డి అసలు రూపం బయటపడింది. అక్కతో ప్రేమాయణం నడిపిన అతడి కన్ను చెల్లెలిపై పడింది. తనతో దిగిన ఫోటోలు, వీడియోలు చూపించి ప్రియురాలిని బెదిరించాడు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని వస్తే ఫోటోలు, వీడియోలు డిలీట్ చేస్తానని నమ్మబలికాడు. దీంతో చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి రహస్యంగా బంగారు ఆభరణాలు తీసుకుని అవినాష్ రెడ్డికి ఇచ్చింది. ఆ తరువాత ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయమని కోరింది.

Marriage Funny Video: టోపీపై టెక్నాలజీ అంటే ఇదేనేమో.. ఈ వరుడి ప్రయోగం చూస్తే.. ఖంగుతినాల్సిందే..


అందుకు అవినాష్ రెడ్డి అంగీకరించకుండా మరో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ‘నీ చెల్లిని తీసుకుచ్చి అప్పగించు’ అని బెదిరించాడు. బంగారం, నగదు తెచ్చి ఇచ్చినప్పటికీ.. చెల్లెలు కావాలని అడగడటంతో మైనర్ తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు తనకు చావే శరణ్యమని భావించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు మైనర్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మైనర్‌ తండ్రి తిరుమల రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. తమ కుమార్తెలను ఇబ్బందులకు గురి చేసిన అవినాష్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

AP Revenue Comparison: సంపదపై శోకాలు

Timmapur Railway Station: పట్టాలు దాటుతుండగా ఊహించని ఘటన

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 12:21 PM