Ram Mohan Reddy: కొడంగల్‌లో మీరొక్క జెడ్పీటీసీ సీటు గెలిచినా రాజీనామా చేస్తా..
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:45 AM
‘దమ్ముంటే.. కొడంగల్ నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ లేదా ఒక ఎంపీపీ సీటు గెలువు.. రాజీనామా చేసేందుకు నేను సిద్ధం!’ అంటూ కేటీఆర్‌కు పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సవాల్ విసిరారు.

కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సవాల్
అప్పుల్లో ఉన్నా.. హామీలన్నీ నెరవేరస్తున్నాం: యశస్వినీ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ‘దమ్ముంటే.. కొడంగల్ నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ లేదా ఒక ఎంపీపీ సీటు గెలువు.. రాజీనామా చేసేందుకు నేను సిద్ధం!’ అంటూ కేటీఆర్‌కు పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సవాల్ విసిరారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేసి కొడంగల్‌లో మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు స్పందించారు. రాజీనామాకు తమ నాయకుడు రేవంత్ అవసరం లేదని, తాను సిద్ధంగా ఉన్నానన్నారు.
కేటీఆర్‌కు దమ్ముంటే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, కేకే మహేందర్‌రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంటామన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉన్నా.. ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తోందని పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నేతలు.. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్డీన్, యశస్వినీరెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు.