Share News

R. Krishnaiah: సీఎం రేవంత్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Feb 16 , 2025 | 03:49 AM

ప్రధాని మోదీ బీసీ కాదని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు.

R. Krishnaiah: సీఎం రేవంత్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి

  • మోదీ బీసీ కాదని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

  • లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం: ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

రాంనగర్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ బీసీ కాదని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. మోదీ బీసీ కాదన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కులగణన తప్పుడు సర్వే వల్ల ప్రభుత్వానికి వస్తున్న చెడ్డ పేరు నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే మోదీపై రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. కేంద్రంలో 27 మంది బీసీలకు మంత్రి పదవులు ఇస్తే రేవంత్‌ రెడ్డి ఇద్దరికే ఇచ్చారని అన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 03:49 AM