Share News

Srushti Fertility Doctor Namrata: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:34 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ (శుక్రవారం) డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సృష్టి కేసు వ్యవహారంలో తొలిరోజు కస్టడీలో భాగంగా డాక్టర్ నమ్రతను పోలీసులు విచారిస్తున్నారు.

Srushti Fertility Doctor Namrata: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత
Doctor Namrata

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ(శుక్రవారం) డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సృష్టి కేసు వ్యవహారంలో తొలిరోజు కస్టడీలో భాగంగా డాక్టర్ నమ్రతను పోలీసులు విచారిస్తున్నారు. సుమారు ఐదు గంటలుగా నమ్రతకు గోపాలపురం పోలీసులు ప్రశ్నలు సంధిస్తున్నారు. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది.


అయితే.. చైల్డ్ ట్రాఫికింగ్‌పై అడిగిన ప్రశ్నలకు నమ్రత నోరు మెదపడం లేదని సమాచారం. ఎటువంటి తప్పు చేయలేదంటూ సమాధానం చెబుతున్నట్లు తెలుస్తోంది. తాను ఎవరినీ బెదిరించలేదని, మోసం చేయలేదని పేర్కొంది. నిజనిజాలు త్వరలోనే బయటపడుతాయని పోలీసులతో నమ్రత చెప్పినట్లు తెలుస్తోంది.


ప్రశ్నల వర్షం..

నమ్రత ఏజెంట్లు, ANM, ఆశా వర్కర్ల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక్కొక్క దంపతుల వద్ద ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ప్రశ్నిస్తున్నారు. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ సృష్టి ఫెర్టిలిటీ బ్రాంచీలపై వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకూ ఎంతమంది తల్లిదండ్రులకు పిల్లలను సరోగసి పేరుతో విక్రయాలు జరిపారు..? న్యాయవాది వృత్తి పేరుతో కొడుకు జయంత్ కృష్ణ బాధితులను బెదిరించడంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఫెర్టిలిటీ సెంటర్లో నమోదు చేసుకున్న తల్లిదండ్రుల వివరాలపైనా ఆరా తీస్తున్నారు. ఎలాంటి పశ్చాతాపం లేకుండా పిల్లలను దత్తతకు అరేంజ్ చేశామని బహిరంగంగానే నమ్రత చెబుతున్నట్లు సమాచారం.


హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలో ఖైదీగా ఉన్న డాక్టర్ నమ్రతను ఇవాళ (శుక్రవారం) పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించనున్నారు. నమ్రతపై హ్యూమన్ ట్రాఫికింగ్‌తోపాటు పలు కేసులు నమోదు అయ్యాయి. పిల్లలు లేని దంపతులను టార్గెట్‌గా చేసుకుని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో(Srushti Fertility Center) సరోగసి మాటున శిశువుల విక్రయాలు, అలాగే ఇతరుల స్పర్మ్ తో పిల్లలు పుట్టేలా చేశారనే ఆరోపణలపై డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

రేపట్నుంచి ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ షురూ

దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..

Updated Date - Aug 01 , 2025 | 06:02 PM