KTR Jagadish Reddy Case: కేటీఆర్, జగదీష్ రెడ్డికి హైకోర్టులో ఊరట..
ABN , Publish Date - Aug 01 , 2025 | 04:55 PM
తమపై నమోదైన కేసును కొట్టేయాలని మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గత కొన్ని నెలలుగా న్యాయస్థానంలో వాదనలు వినిపించారు ఇరువైపు న్యాయవాదులు.

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇరువురిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారని తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు కేటీఆర్, జగదీష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
అయితే తమపై నమోదైన కేసును కొట్టేయాలని కేటీఆర్(KTR), జగదీష్ రెడ్డి(Jagadish Reddy) హైకోర్టును ఆశ్రయించారు. గత కొన్ని నెలలుగా న్యాయస్థానంలో వాదనలు వినిపించారు ఇరువైపు న్యాయవాదులు. ఇరువైపులా వాదనలు ముగియడంతో గత నెల 11న తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఫేక్ వీడియోలపై ఎలాంటి ఆధారాలు లేవని తీన్మార్ మల్లన్న దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు ఇవాళ(శుక్రవారం) కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేటీఆర్, జగదీష్ రెడ్డికి భారీ ఉపశమనం లభించింది.
తాజాగా ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. తెలంగాణ జాగృతి కార్యకర్తలు మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు. అయితే కొన్ని రోజులు వాడీవేడిగా నడిచిన దాడి ప్రస్తావన ఆ తర్వాత ఎందుకో డీలా పడింది. అయితే కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకూ బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ స్పందించికపోవడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
కోవూరులో ఉద్రిక్తత.. క్షమాపణలు చెప్పాలంటూ మహిళల డిమాండ్