Compensation Industrial Accident: సిగాచి బాధితులకు న్యాయం చేయాలి
ABN , Publish Date - Jul 27 , 2025 | 04:32 AM
పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో గత నెల 30న జరిగిన పేలుడు ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన

హైకోర్టులో పిల్
పటాన్‌చెరు రూరల్, జూలై 26(ఆంధ్రజ్యోతి): పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో గత నెల 30న జరిగిన పేలుడు ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన వారికి న్యాయం చేయాలని కోరుతూ ‘సైంటిస్ట్స్ ఫర్ పీపుల్’ సంస్థ వ్యవస్థాపకుడు కలపాల బాబూరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ఈ ప్రమాదంలో గల్లంతైన ఎనిమిది మందితో సహా మరణించిన 54మంది కార్మికుల కుటుంబాలకు, గాయపడిన 28 మంది కార్మికులకు సీఎం, పరిశ్రమ యాజమాన్యం ప్రకటించిన పూర్తి పరిహారాన్ని వెంటనే చెల్లించాలని అందులో కోరారు. పరిశ్రమ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 8 మంది కార్మికుల మృతదేహాలు లభ్యం కానప్పటికీ, వారిని మరణించిన వారిగానే ప్రకటించి పరిహారం అందించాలని కోరారు.