Instagram: ఇన్‌స్టాగ్రామ్ తెచ్చిన పంచాయతీ.. తల్లీ కూతుళ్లు అదృశ్యం
ABN , Publish Date - Mar 07 , 2025 | 11:45 AM
ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేస్తున్న భార్యను మందలించాడు భర్త. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్యను చెల్లెలు ఇంటి వద్ద ఉంచడంతో ఇంట్లో చెప్పకుండా భార్య తన కూతురుతో కలిసి అదృశ్యమైన సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో చాటింగ్ చేస్తున్న భార్యను మందలించాడు భర్త. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్యను చెల్లెలు ఇంటి వద్ద ఉంచడంతో ఇంట్లో చెప్పకుండా భార్య తన కూతురుతో కలిసి అదృశ్యమైన సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్(Hayatnagar Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంట్లూర్ రావినారాయణరెడ్డి కాలనీ(Kuntlur Ravinarayana Reddy Colony)లో నివాసం ఉండే గుమ్మడి స్వామికి 2010లో గుమ్మడి ఆశ(35)తో వివాహం జరిగింది. వీరికి వైష్ణవి, నిఖిత అను ఇద్దరు సంతానం. ఆశ కూలీగా పని చేస్తుంది.
ఈ వార్తను కూడా చదవండి: Special trains: చర్లపల్లి నుంచి మాల్దా టౌన్‌కు ప్రత్యేక రైళ్లు..
ఆశ బుధవారం రాత్రి 8గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తితో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేస్తుంది. ఈ విషయాన్ని గమనించిన భర్త స్వామి ఎవరితో చాటింగ్ చేస్తున్నావని ప్రశ్నించడంతో ఆమె మౌనం వహించింది. దీంతో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. వెంటనే స్వామి అంజనాద్రినగర్ కాలనీలో నివాసం ఉండే తన చెల్లెలు రజిత వద్దకు ఆశ, కూతురు నిఖితను తీసుకుని పోయి అక్కడ ఉంచాడు. అనంతరం స్వామి తిరిగి రావినారాయణరెడ్డి కాలనీలోని తన ఇంటికి వచ్చాడు.
ఇదిలా ఉండగా రాత్రి 9.30గంటలకు ఆశ తన కూతురును తీసుకుని రావినారాయణరెడ్డికాలనీ ఇంటికి వెళ్తున్నానని మరదలుకు చెప్పి ఇంటికి వెళ్లకుండా బయటకు వెళ్లింది. ఇదే విషయాన్ని రజిత అన్న స్వామికి ఫోన్‌చేసి చెప్పింది. దీంతో స్వామి ఆశ గురించి బంధువుల వద్ద విచారించినా ఫలితం లేకపోవడంతో గురువారం సాయంత్రం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి
ఈ వార్తను కూడా చదవండి: Srisailam Dam: ముప్పు ముంగిట శ్రీశైలం!
ఈ వార్తను కూడా చదవండి: Transfers: భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు!?
ఈ వార్తను కూడా చదవండి: ఆస్తి పన్ను వసూళ్లపై స్పెషల్ ఫోకస్
Read Latest Telangana News and National News